viral video:అగ్నిపర్వతం బద్దలు -ఇళ్లపైకి లావా -15మంది మృతి -170 మంది చిన్నారులు గల్లంతు

సెంట్రల్ ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (కాంగో) దేశంలో అగ్నిపర్వతం బద్దలైన ఘటన అనూహ్య విషాదాన్ని నింపింది. దశాబ్దాలుగా రగులుతోన్న ఆ అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అంచనా వేసి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో యంత్రాంగం విఫలం చెందడంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. అగ్నిపర్వతం బద్దలై ఉప్పొంగిన లావా ఊరిని ముంచెత్తుతోన్న పలు దృశ్యాలు వైరల్ అయ్యాయి. వివరాలివి..

Recommended Video

    #TOPNEWS: Congo Volcano Eruption | Oneindia Telugu

    వీధులు, ఇళ్లపైకి లావా..

    కాంగోలోని ప్రఖ్యాత ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ బద్దలైంది. శనివారం రాత్రి అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా పైకి ఉప్పొంగింది. ఆ సమయంలో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వేవి వేడి లావా ప్రవాహం నుంచి దూరంగా పారిపోతూ జనం హాహాకారాలు చేశారు. అగ్నిపర్వతం బద్దలు కావడానికి కేవలం కొద్ది నిమిషాల ముందు మాత్రమే హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు ముందస్తుగా ఊరిని ఖాళీ చేసే వీలు లేకపోయింది. దీంతో ప్రాణనష్టం సంభవించింి..

    వందల మంది చిన్నారులు గల్లంతు..

    ఇరగోంగో అగ్ని పర్వతం బద్దలై, గోమా నగరంలోకి లావా ప్రవహించడంతో వందల సంఖ్యలో ఇళ్లు కాలి బూడిదైపోయాయి. దొరికిన వస్తువు చేతపట్టుకుని స్థానికులు నగరాన్ని విడిచివెళ్లారు. అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో ఇప్పటిదాకా 15 మంది చనిపోయినట్లు నిర్ధారణ అయింది. మరణాల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సుమారు 170 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్‌ ఎమర్జెన్సీ ఫండ్‌ (యూనిసెఫ్‌) ప్రకటించడం సంచలనంగా మారింది. గోమా నగరం దేశ సరిహద్దులో ఉండటంతో ఇప్పటి వరకు 8వేల మందికిపైగా పక్కనున్న రువాండా దేశంలోకి చేరారు. రువాండా అత్యవసర నిర్వహణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని క్యాంపులో కాంగో జనం తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. మరో 25వేల మంది ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

    ఎటు చూసినా భగభగ లావా..

    అగ్నిపర్వతం బద్దలైన తర్వాత గోమా సిటీ శివారులో ఎటు చూసినా భగభగ లాడే లావా ప్రవాహం కనిపించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇరగోంగో అగ్నిపర్వతం రాత్రి సమయంలో బద్దలవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌ (ఎన్‌ఆర్‌సీ) ప్రతినిధి తెలిపారు. క్యాంప్ మున్జెంజ్ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో నలుగురు ఖైదీలు లావా ధాటికి మరణించినట్లు అధికారులు చెప్పారు. ఎన్‌ఆర్‌సీ అంచనా ప్రకారం.. గోమా చుట్టూ సుమారు 600 గృహాలు, ఐదు పాఠశాలలు ధ్వంసమయ్యాయి. 2002లో ఇదే ఇరగోంగో అగ్నిపర్వతం విస్పోటనం చెందిన సమయంలో 250 మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులై ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పుడు కూడా ప్రజల్ని హెచ్చరించి, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఆలస్యం తలెత్తడం వల్లే ప్రాణనష్టం భారీగా ఉండింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+