• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నోటి దురద తెచ్చిన తంటా! కరోనాపై వ్యాఖ్యలు వ్యంగ్యమేనంటూ ట్రంప్, కట్ చేసేశారు!

|

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడమే ఒక సంచలనం. ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రసంగాల్లో ఏదో ఓ చోట ఆయన నోటి దురద చాటుకుంటూనే ఉంటున్నారు. పలుమార్లు ఏదో ఒకటి చెప్పి తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రపంచ దేశాల నుంచే గాక, సొంత దేశం నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ట్రంప్‌కేమైనా పిచ్చిపట్టిందా? అన్న విమర్శలు కూడా రావడం గమనార్హం.

ట్రంప్ వివరణ ఇచ్చుకున్నా..

ట్రంప్ వివరణ ఇచ్చుకున్నా..

ట్రంప్ ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆయన తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గకతప్పలేదు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యాఖ్యలు తాను వ్యంగ్యంగా చేసినవేనని చెప్పుకొచ్చారు. అయినా, దేశ అధ్యక్షుడి స్థాయిలో ఉండి ఇలాంటి విపత్కర సమయంలో వ్యంగ్య భాషణమేంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ట్రంప్ ప్రమాదకరమైన సూచనలు.. రివర్స్

ట్రంప్ ప్రమాదకరమైన సూచనలు.. రివర్స్

అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా బారినపడి 50వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ గురువారం మాట్లాడుతూ.. కరోనావైరస్‌ను చంపడానికి క్రిమినాశక రసాయనాల(డిస్‌ఇన్ఫెక్టెంట్)ను రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలంటూ ఓ ప్రమాదకర సూచన చేశారు. అంతేగాక, అతినీలలోహిత(యూవీ) కిరణాలను చొప్పించాలని కూడా సలహాపడేశారు. దీంతో అమెరికాలోని వైద్య నిపుణులతోపాటు ప్రభుత్వంలోని వారు కూడా తీవ్రంగా మండిపడ్డారు.

ట్రంప్ నోటికి కట్ చెప్పేశారు..

ట్రంప్ నోటికి కట్ చెప్పేశారు..

ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన వ్యవహారశైలిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని అధ్యక్షుడికి సూచించడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో ఎన్నికల రానున్న సమయంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇక నుంచి కరోనాపై జరిగే రోజువారీ మీడియా సమావేశంలో ట్రంప్‌తో పరిమితంగా మాట్లాడించాలని నిర్ణయించినట్లు సమాచారం.

  Donald Trump Surprising Words on North Korean Leader Kim Jong Un
  ఇక మొదలైంది.. ఇక వారే ప్రముఖంగా..

  ఇక మొదలైంది.. ఇక వారే ప్రముఖంగా..

  అంతేగాక, కొవిడ్-19కు సంబంధిచిన మీడియా సమావేశాల్లో వైద్య నిపుణులు, కరోనా కట్టడి కోసం వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కీలకంగా వ్యవహించేలా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ట్రంప్ శుక్రవారం నాటి మీడియా సమావేశంలో ఎలాంటి ప్రశ్నలు స్వీకరించకపోవడం గమనార్హం. ఇక కరోనాకు సంబంధించిన మీడియా సమావేశాల్లో సంబంధిత అధికారులు, వైద్య నిపుణులు మాత్రమే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది.

  English summary
  Controversy: Trump Now Claims His Comments On Injecting Disinfectants Were ‘Sarcastic’.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X