అలర్ట్ అలర్ట్: కరోనా సోకిన వారికి రక్తం గడ్డ కట్టే ఛాన్స్ ఎక్కువ.. టీకా తీసుకుంటే..
కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. వైరస్ సోకిన వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 3 నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా సోకిన వారు.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పరిశోధకులు స్టడీ చేస్తూనే ఉన్నారు.

రక్తం గడ్డ కట్టడం
కరోనాకు సంబంధించి టీకాలు ఇవ్వడం వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే.. కరోనా సోకిన వారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువని తేల్చారు. అధ్యయన ఫలితాలను బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ఆక్స్‌ఫర్డ్, లేసెస్టర్, కేంబ్రిడ్జీ, ఎడిన్‌బర్గ్, నాటింగ్‌హామ్ వర్సిటీ సహా ఎన్‌హెచ్‌ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనంలో పాల్గొన్నారు.

2.9 కోట్ల మందిపై పరిశోధన..
ఫైజర్, ఆస్ట్రాజెనెకా తొలి డోసు తీసుకున్న మొత్తం 2.9 కోట్ల మందిపై అధ్యయనం చేశారు. డిసెంబర్ 1, 2020- ఏప్రిల్ 24, 2021 మధ్య ఈ పరిశోధన జరిగింది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. ఈ ముప్పు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో మరింత ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. పైగా వీరిలో దీర్ఘకాలం ఈ సమస్య ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా.. వెంటనే వైద్యసాయం తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. కరోనా సోకిన వారు సైతం దీర్ఘకాలం అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. తద్వారా రక్తం గడ్డ కట్టే ముప్పును ముందే పసిగట్టి నివారణ కోసం చికిత్స చేసే అవకాశం ఉంటుందన్నారు. ఆస్ట్రాజెనికా వాడకాన్ని అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధులకే పరిమితం చేశాయి. యువతకు రక్తం గడ్డకట్టే అవకాశాలు ఈ వ్యాక్సిన్‌తో ఎక్కువగా ఉన్నాయనే పరిశోధనలే ఇందుకు కారణం.
Recommended Video

థర్డ్ వేవ్ భయం..
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications