భవిష్యత్ మహమ్మారులతో పోలిస్తే కరోనా చిన్నదే .. తీవ్ర ఆరోగ్య సంక్షోభాలకు సిద్ధం కండి : డబ్ల్యూహెచ్ఓ
కరోనావైరస్ సంక్షోభం చివరి మహమ్మారి కాదు, వాతావరణ మార్పులను చూస్తుంటే, జంతు సంక్షేమంపై దృష్టి పెట్టకుండా , సమస్యలను పరిష్కరించకుండా మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు చాలా విచారకరంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ చెప్పారు.
కరోనావైరస్ చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని , తరువాతి మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరించారు.
ఇండియాలో కరోనా తాజా పరిస్థితి ఇది .. 1.02 కోట్ల కేసులతో భారత్, కొత్త వైరస్ స్ట్రెయిన్ తో భయం భయం

కరోనా మహమ్మారి చివరిది కాదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
టెడ్రోస్ మాట్లాడుతూ,ఇది చివరి మహమ్మారి కాదు. ఇలాంటి మహమ్మారుల వ్యాప్తి తరువాత కాలంలో కూడా కొనసాగుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి .టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఒక వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు మాత్రమే డబ్బులు ఖర్చు చేసి ఆ తరువాత మరి ఇంకేమీ పట్టించుకోని పరిస్థితులను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ కోవిడ్ -19 మహమ్మారి నుండి పాఠాలు నేర్చుకోవలసిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు

సమస్య వస్తేనే స్పందించే గుణం మారాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
చాలా కాలం నుండి, ప్రపంచం భయాందోళనలు మరియు నిర్లక్ష్యం యొక్క చక్రంలో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఒక వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు డబ్బును విసిరివేస్తాము, అది ముగిసినప్పుడు, మేము దాని గురించి మరచిపోతాము , ఆ తర్వాత వచ్చే వాటిని నిరోధించడం కోసం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోము అనే విధానాన్ని తప్పుపట్టిన ఆయన, అది చాలా ప్రమాదకరమైన స్వల్ప దృష్టిగల ఆలోచన అని పేర్కొన్నారు.

భవిష్యత్ లో రాబోయే మహామ్మారులతో పోలిస్తే కరోనా చిన్నదే
కరోనా మహమ్మారి మాత్రమే కాదు భవిష్యత్ లో మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ సిద్ధంగా ఉండాలని, భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని ఆయన హెచ్చరించారు.
కరోనా మహమ్మారి చివరి మహమ్మారి కాదని చరిత్ర చెబుతుంది, అంతేకాదు అంటువ్యాధులు ప్రబలుతుండటం జీవిత వాస్తవం అని టెడ్రోస్ అన్నారు. భవిష్యత్తులో రాబోయే మహమ్మారులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైకేల్ ర్యాన్ పేర్కొన్నారు.

కరోనా రూపాంతరం చెందుతున్నా ఎదుర్కోవటానికి కావాల్సిన సామర్ధ్యాలు లేవు
భవిష్యత్తు మహమ్మారు లను ఎదుర్కోవడానికి కావలసిన సామర్థ్యం అందుకోవడంలో ఇంకా చాలా దూరంలో ఉన్నామని పేర్కొన్నారు. కరోనా రోజు రోజుకి రూపాంతరం చెందుతుందని , రెండు మూడు దశల్లో ప్రవేశిస్తుందని వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మనం ఇంకా పూర్తిగా సన్నద్ధం గా లేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఏఎఫ్పీ సంకలనం చేసిన అధికారిక వర్గాల లెక్క ప్రకారం కరోనావైరస్ కనీసం 1.75 మిలియన్ల మంది ప్రాణాలు తీసింది గత డిసెంబరులో చైనాలో వ్యాప్తి చెందినప్పటి నుండి దాదాపు 80 మిలియన్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

ఆరోగ్య రక్షణకు దృష్టి పెట్టండి .. పెట్టుబడులు పెట్టి భవిష్యత్ ప్రమాదాలు నివారించండి
గత 12 నెలల్లో, మన ప్రపంచం తలక్రిందులైంది. మహమ్మారి యొక్క ప్రభావాలు వ్యాధికి మించినవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా సమాజం, ఆర్థిక వ్యవస్థ కుదేలైంది అని పేర్కొంది. మహమ్మారి మనకు బోధిస్తున్న పాఠాల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
అన్ని రకాల అత్యవసర పరిస్థితులను నివారించడానికి, గుర్తించడానికి మరియు తగ్గించడానికి అన్ని దేశాలు సంసిద్ధత సామర్థ్యాలలో పెట్టుబడులు పెట్టాలని టెడ్రోస్ అన్నారు . బలమైన ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ సదుపాయం అన్ని దేశాల ప్రజలకు కల్పించాలని పిలుపునిచ్చింది .