• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భవిష్యత్ లో కరోనా మహమ్మారి విశ్వరూపం... డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ వ్యాఖ్యలు

|

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి పంజా విసరటం ఇది ఆరంభం మాత్రమే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది . ఇప్పటివరకు కరోనా వైరస్ ప్రభావం స్వల్పంగానే ఉందని , కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందని చెప్పారు . గతంలో స్పానిష్ ఫ్లూ తరహాలో ఇది ప్రవర్తిస్తుంది అని పేర్కొన్నారు.

కరోనా నుండి ఊపిరి తీసుకోలేము అంటున్న డబ్ల్యూహెచ్ఓ

కరోనా నుండి ఊపిరి తీసుకోలేము అంటున్న డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటికే పలు దేశాల్లో విధ్వంసం సృష్టిస్తుంది . ఇప్పటికే 25 లక్షల మందిని భాధిస్తూ, 1.66 లక్షలకు పైగా ప్రాణాలను బలిగొంది. వైరస్ ప్రభావంతో ఎన్నో దేశాలు ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడ్డాయి . లాక్ డౌన్ విధించి కరోనాను కట్టడి చెయ్యాలని చేస్తున్న ప్రయత్నంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్తంభించిపోయాయి . కరోనా నుంచి నిదానంగా బయట పడుతున్నామన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చాలా దేశాలు ఊపిరి తీసుకుంటున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం వెల్లడించింది .

ప్రస్తుతానికి నిదానించినా కరోనా విశ్వరూపం చూపిస్తుందని షాకింగ్ విషయం

ప్రస్తుతానికి నిదానించినా కరోనా విశ్వరూపం చూపిస్తుందని షాకింగ్ విషయం

జనీవాలో మాట్లాడిన టీడ్రాస్ కరోనా మహమ్మారి ప్రస్తుతానికి నిదానించినా మళ్ళీ తన విశ్వరూపం చూపించే అవకాశం ఉందని , ఇక లాక్ డౌన్ ను చాలా కాలం కొనసాగించలేమని ఆయన పేర్కొన్నారు. ముందుముందు వైద్య సదుపాయాలూ తక్కువగా ఉన్న తక్కువగా అభివృద్ధి చెందిన ఆఫ్రికా దేశాల్లో కరోనా మరణమృదంగం సృష్టించనుందని జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ అంచనా వేసిందని టీడ్రాస్ పేర్కొన్నారు .

స్పానిష్ ఫ్లూ కి కరోనా వైరస్ కి సారూప్యత

స్పానిష్ ఫ్లూ కి కరోనా వైరస్ కి సారూప్యత

కరోనాకు, 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ కి ఎన్నో సారూప్యాలున్నాయని, స్పానిష్ ఫ్లూ తరహాలోనే, కరోనా సైతం నిదానంగా పంజా విసిరి ప్రాణాలు తీస్తుందని హెచ్చరించారు.

ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని , ఇక ఇది తన ప్రభావాన్ని చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు . 1918లో దాదాపు కోటి మందిని మృత్యువాత పడేసిన స్పానిష్ ఫ్లూ వంటిదే ఇదని పేర్కొన్నారు . అయితే గతానికి, ప్రస్తుతానికి వ్యత్యాసం ఉందని , ఇప్పుడు సాంకేతికత అందుబాటులో ఉందని పేర్కొన్నారు .

 అన్ని దేశాలు కలిసి పోరాటం చెయ్యాల్సిన సమయం

అన్ని దేశాలు కలిసి పోరాటం చెయ్యాల్సిన సమయం

ఇక దీని ద్వారా మహమ్మారి ఉత్పాతాన్ని నివారించే వీలుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు . ఇక ఆ స్థాయిలో కష్టం ప్రపంచానికి రాకుండా చూడవచ్చునని పేర్కొన్నారు . మహమ్మారి విశ్వరూపం ముందు ముందు చూపించే అవకాశం ఉందని ఈ దురదృష్టాన్ని నివారించేందుకు అన్ని దేశాలూ కలిసి పోరాటం చెయ్యాలని టీడ్రాస్ పిలుపునిచ్చారు . ఈ వైరస్ చూపే ప్రభావంపై ఇప్పటికీ ఎంతో మందికి అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు .

  Watch : Indian Origin Doctor In US Honored In Front Of Her House With A Parade
  మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందన్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అడ్హనామ్

  మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందన్న డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అడ్హనామ్

  కరోనా ప్రభావం ప్రస్తుతానికి స్వల్పమేనని, ముందుముందు మహమ్మారి విశ్వరూపం కనిపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టీడ్రాస్ అడ్హనామ్ వ్యాఖ్యానించటంఇప్పుడు టెన్షన్ కు కారణం అవుతుంది . ఎన్నో దేశాల్లో కరోనా ఇప్పుడిప్పుడే పంజా విసరడం ప్రారంభించిందని, కొన్ని దేశాల్లో నియంత్రణా చర్యల మూలంగా కొంత మేరకు నిదానించిందని గుర్తు చేసిన ఆయన, కరోనా మళ్ళీ తన విశ్వరూపం చూపిస్తుందని పేర్కొన్నారు.

  English summary
  Corona has many similarities to the Spanish flu of 1918, and, just like the Spanish flu, Corona has also been warned that it is a slow claw.He claimed that it was the most dangerous virus, and that it had an effect. In 1918, it was said that the Spanish flu, which killed nearly a million people, was not. But in the past, there was a difference, and now the technology is available.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X