వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: చైనాలో మరణమృందంగం: 7700 మందికి సోకిన వైరస్: 170 మంది మృతి: రోజురోజుకూ..!

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి చైనా అతలాకుతలమైపోతోంది. ఏ నిమిషానికి ఎవరు మరణిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చైనాలో ఒక్కరోజే 50 మంది మరణించారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం నాటికి 130 మంది వరకు నమోదైన మృతుల సంఖ్య.. 24 గంటలు తిరిగే సరికి 170కి చేరుకుంది. మరో 7,700 మందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. వారిని వివిధ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!

1370 మంది పరిస్థితి ఆందోళనకరంగా..

1370 మంది పరిస్థితి ఆందోళనకరంగా..

వైరస్ సోకినట్టు గుర్తించిన వారిలో 1370 మంది పరిస్థితి ఆందోొళనకరంగా ఉన్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కొత్తగా మరో 1700 మంది వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. కరోనా వైరస్ సోకిందా? లేదా? అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. వైరస్‌ను నియంత్రించడానికి చైనా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. వుహాన్ సిటీకే పరిమితమైన ఈ వైరస్ ప్రస్తుతం 17 నగరాలకు వ్యాపించింది.

 చైనా ఆర్థిక రాజధానిలో వంద కేసులు..

చైనా ఆర్థిక రాజధానిలో వంద కేసులు..

చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో సుమారు వంద కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వందమంది రక్త నమూనాలను పరిశీలించగా.. అది పాజిటివ్‌గా తేలింది. రాజధాని బీజింగ్‌లో కొత్తగా మరో 111 కేసులు గుర్తించారు అక్కడి డాక్టర్లు. వారందర్నీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్‌ను నయం చేయడానికి అవసరమైన మందులు ఏవీ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

హ్యూబే ప్రావిన్స్‌లోనే 160 మంది మృతి

హ్యూబే ప్రావిన్స్‌లోనే 160 మంది మృతి


ఒక్క హ్యూబే ప్రావిన్స్‌లోనే 160 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ సిటీ ఉన్నది ఈ ప్రావిన్స్‌లోనే వుహాన్ సిటీ సహా ఈ ప్రావిన్స్‌లోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్‌ చుట్టబెట్టింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వారి సంఖ్య కూడా ఈ ప్రావిన్స్‌లోనే అధికంగా నమోదైంది. దీనితో- ఈ ప్రావిన్స్‌కు అన్ని రకాల రవాణా మార్గాలపైనా ఆంక్షలు విధించి చైనా ప్రభుత్వం.

అమెరికా అప్రమత్తం..

అమెరికా అప్రమత్తం..

అమెరికాలో వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్‌లల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసు నమోదు కాగా.. కాలిఫోర్నియాలో ఇద్దరిలో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఫలితంగా- అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను నియంత్రించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వైరస్ విస్తరణను అడ్డుకోవడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినప్పటికీ.. అవి పెద్దగా ఫలితాలనివ్వట్లేదు. కరోనా వైరస్ లక్షణాలు గల ప్రయాణికులను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

English summary
The death from the novel Coronavirus has climbed to 170, health officials said on Thursday, adding that more than 7700 people across China are now infected with the disease. China’s national health commission (NHC) said Thursday that at least 1,370 are critically ill with the infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X