వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాడని అపార్ట్ మెంట్ లలోనూ, ఎవరూ లేని చోట కూడా .. కరోనా వైరస్ .. ఎలాగంటే !!

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది . కరోనా వైరస్ ఖాళీగా ఉన్న ఎవరూ లేని స్థలాల్లో , అపార్ట్ మెంట్ లలో కూడా ఉంటుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది . చైనాలోని గ్వాంగ్‌జౌలో ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్ యొక్క బాత్రూంలో కరోనావైరస్ ఉన్నట్టు అధ్యయనంలో తేలింది .సుదీర్ఘంగా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ యొక్క సింక్, ట్యాప్ , షవర్ హ్యాండిల్ పైన కూడా కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించారు .

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీకి కేంద్రం అఫిడవిట్ ... తెలంగాణాకు షాక్ ..ఏపీ వాదనకు సమర్ధనరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీకి కేంద్రం అఫిడవిట్ ... తెలంగాణాకు షాక్ ..ఏపీ వాదనకు సమర్ధన

ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్ లో కరోనా వైరస్ ఆనవాళ్ళు

ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్ లో కరోనా వైరస్ ఆనవాళ్ళు

ఈ నెల ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిశోధకులు తెలిపారు. ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్ లో క్రింద ఇంట్లో ఉన్న వాళ్ళు కరోనా వైరస్ బారిన పడటంతో , ఖాళీగా ఉన్న ఇంట్లోనూ అధ్యయనం చేశారు. దీంతో అక్కడ కరోనా వైరస్ ఆనవాళ్ళు గుర్తించారు . టాయిలెట్ ఫ్లష్ యొక్క శక్తి ద్వారా కరోనా వైరస్ గాలిలో సూక్ష్మ కణాల ద్వారా వ్యర్థ పైపుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా అన్న దానిపై శాస్త్రవేత్తలు "ఆన్-సైట్ ట్రేసర్ సిమ్యులేషన్ ప్రయోగం" నిర్వహించారు.

టాయిలెట్ ఫ్లష్ , డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా కరోనా వైరస్ ప్రయాణం

టాయిలెట్ ఫ్లష్ , డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా కరోనా వైరస్ ప్రయాణం

కోవిడ్ -19 కేసుల కంటే 10 మరియు 12 స్థాయిల అధికంగా బాత్‌రూమ్‌లలో ఏరోసోల్స్ అని పిలువబడే కణాలను వారు కనుగొన్నారు. మలం నుండి కరోనా వైరస్ ఫ్లషింగ్ ద్వారా గాలిలోకి వెళ్లి ఇతరుల ఇళ్లలోకి వెళ్లిపోయాయని గుర్తించారు.మల్టీస్టోర్ భవనాల్లోని అపార్టుమెంటులలో డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా కూడా వైరస్ ఇతర ఇళ్ళకు వ్యాపించే అవకాశం ఉందని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీలోని ఇంటర్నేషనల్ లాబొరేటరీ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ హెల్త్ డైరెక్టర్ లిడియా మొరావ్స్కా అన్నారు. కొన్నిసార్లు తగినంత నీరు లేనప్పుడు పైపుల ద్వారా కూడా వైరస్ పెరుగుతాయి. అదే సమయంలో ఫ్లష్ చేయటం వల్ల కూడా గాలిలోకి లేచి వైరస్ ప్రయాణిస్తుంది.

 రెండు దశాబ్దాల క్రితం డ్రైనేజ్ పైప్ లైన్ వల్లే శ్వాసకోశ సిండ్రోమ్ .. హాంగ్ కాంగ్ లో మరణ మృదంగం

రెండు దశాబ్దాల క్రితం డ్రైనేజ్ పైప్ లైన్ వల్లే శ్వాసకోశ సిండ్రోమ్ .. హాంగ్ కాంగ్ లో మరణ మృదంగం

కొత్త నివేదిక దాదాపు రెండు దశాబ్దాల క్రితం హాంగ్ కాంగ్ యొక్క అమోయ్ గార్డెన్స్ ప్రైవేట్ హౌసింగ్ ఎస్టేట్ వద్ద జరిగిన కేసును గుర్తుచేస్తుంది, 329 మంది నివాసితులు మురికినీటి పైపులైన్ల లోపం కారణంగా తీవ్రమైన తీవ్రమైన శ్వాసకోశ సిండ్రోమ్ తో బాధ పడ్డారు. ఆ సమయంలో నలభై రెండు నివాసితులు మరణించారు, ఇది సార్స్ యొక్క అత్యంత ప్రమాదకరమైన సమాజ వ్యాప్తికి కారణమైంది. ఇక ఇప్పుడు ఇది కరోనావైరస్ వల్ల కూడా సంభవిస్తుంది అని అధ్యయనం నివేదిస్తుంది .

టాయిలెట్ ఫ్లెష్ , మల మూత్రాల నుండి వైరస్ గాల్లోకి .. తద్వారా వ్యాప్తి

టాయిలెట్ ఫ్లెష్ , మల మూత్రాల నుండి వైరస్ గాల్లోకి .. తద్వారా వ్యాప్తి

టాయిలెట్ ఫ్లష్‌లు మలమూత్రాల నుండి వైరస్ తో నిండిన ఏరోసోల్‌లను ఉత్పత్తి చేస్తాయని మునుపటి పరిశోధనలో తేలిందని చైనా సిడిసి శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ కణాలు ఎక్కువసేపు గాలిలో ఉంటాయి మరియు 1 మీటర్ (3 అడుగులు) కంటే ఎక్కువ దూరం, వెంటిలేషన్ చేయబడిన ప్రదేశాలలో వెళ్లి చేరతాయి. వైరస్ సోకిన వ్యక్తి మలంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు టాయిలెట్ వాడకంలో జాగ్రత్త అవసరం , జాగార్త్తగా ఉండకపోతే గాలిలో వైరస్ ప్రయాణం చేసి ఇతరుకు హాని చెయ్యొచ్చు . ముఖ్యంగా ఆస్పత్రుల్లో అత్యంత జాగ్రత్తగా టాయిలెట్స్ వినియోగించాలి . లేదంటే కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుంది.

English summary
The discovery of coronavirus in the bathroom of an unoccupied apartment in Guangzhou, China, suggests the airborne pathogen may have wafted upwards through drain pipes, .Traces of SARS-CoV-2 were detected in February on the sink, faucet and shower handle of a long-vacant apartment, researchers at the Chinese Center for Disease Control and Prevention said in a study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X