కిల్లర్ కరోనా: 25 మంది మృతి, మరో 830 మందికి సోకిన వైరస్, 70 లక్షల మంది నిర్బంధం

Recommended Video

    Coronavirus Update : Millions Under Lockdown In 5 China Cities || Oneindia Telugu

    కరోనా వైరస్ రక్కసి విరుచుకుపడుతోంది. వైరస్ వల్ల చైనాలో మృతుల సంఖ్య 25 మందికి చేరింది. మరో 830 మందికి వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తి చెందడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

    177 మంది సీరియస్..

    177 మంది సీరియస్..

    మృతుల్లో 24 మంది మధ్య హుబీకి చెందిన వారని చైనా అధికారులు తెలిపారు. మరొకరు హెబీలో చనిపోయారని చెప్పారు. హెబీ బీజింగ్ సరిహద్దులో ఉండటంతో.. రాజధాని ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 177 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

    బీజింగ్‌లో 30

    బీజింగ్‌లో 30

    మరోవైపు జపాన్‌లో కరోనా వైరస్ రెండో కేసు నమోదైంది. చైనాలోని వ్యుహన్‌కు చెందిన ఒకరు ఇటీవల టోక్యో వెళ్లారు. దీంతో అక్కడ రెండో కేసు ఫైల్ అయ్యింది. మరోవైపు చైనాలో వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. చైనా రాజధాని బీజింగ్‌లో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 26 కేసులు కాస్త.. గురువారం రాత్రి మరో నాలుగు ఫైలవడంతో 30కి చేరాయి. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, తైవాన్, జపాన్, అమెరికాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

     స్తంభించిన జనజీవనం..

    స్తంభించిన జనజీవనం..

    చైనాలో వైరస్ వ్యాప్తి చెందడంతో వ్యుహన్, సమీపంలోని ఏడు మిలియన్ల ప్రజలు నివసిస్తోన్న హ్యువాన్‌గాంగ్‌లో ప్రజా రవాణాను అధికారులు నిలిపివేశారు. వైరస్ వ్యాప్తి వల్ల 70 లక్షల మంది ప్రజలు ఎక్కడికక్కడే నిలిపివేయడం ప్రపంచ ఆరోగ్య చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి గౌడెన్ గెలియా పేర్కొన్నారు. అయితే వారు ప్రయాణం/వాణిజ్యం కోసం ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లొద్దనే అంశంపై మాత్రం పరిమితి విధించలేదని తెలిపారు.

    న్యూ ఇయర్ కోసం..

    న్యూ ఇయర్ కోసం..

    అయితే శనివారం చైనా వారి చంద్ర నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా వారం రోజుల ముందునుంచే తమ స్వస్థలాలకు వెళ్లేందుకు జనాలు క్యూ కడుతుంటారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి చెందడంతో.. లక్షలాది మంద ప్రజలు ఎక్కడికక్కడే నిలిచిపోయే అవకాశం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+