వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో తీవ్ర అస్థిరత, ఆప్ఘన్ ప్రెసిడెంట్ అస్రఫ్ ఘని

|
Google Oneindia TeluguNews

ఆప్గనిస్తాన్ తీవ్ర అస్థిరత ప్రమాదంలో చిక్కుకుందని అధ్యక్షుడు అస్రఫ్ ఘని అన్నారు. దానిని నివారించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామనిప్రకటించారు. తాలిబన్లు తమ పోరు తీవ్రతను పెంచుతూ క్రమంగా కాబూల్ నగరానికి చేరువవుతున్న తరుణంలో..శనివారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన దేశం ఇప్పుడు అస్థిరత ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రమాదకర పరిస్థితుల్లో పడిందని, తమ భవిష్యత్తు గురించి ప్రజలు ఎలా ఆందోళన చెందుతున్నారో తనకు తెలుసునని ఆయన చెప్పారు.

 country in serious danger of instability:Ashraf Ghani

ఆఫ్ఘనిస్థాన్ మరింత అస్థిరతను, హింసను ఎదుర్కోకుండా మీ అధ్యక్షునిగా హామీ ఇస్తున్నానన్నారు. మీరు దేశం వదిలి వెళ్లకుండా చూస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యూరిటీ, రక్షణ దళాలను సమీకరించడం తమ టాప్ ప్రయారిటీ అని ఆయన పేర్కొన్నారు. తాజా పరిస్థితులపై ప్రభుత్వం లోను రాజకీయ నేతలతోనూ, ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చిస్తున్నామని.., శాంతి, సుస్థిరత నెలకొనేలా ఓ రాజకీయ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఘని తెలిపారు.

చర్చల ఫలితాలను త్వరలో మీకు తెలియజేస్తామన్నారు. ఈ యుద్ధం మరింత ముదిరి ప్రజల ఊచకోతకు దారి తీయదని..మీ అయిదేళ్ల విజయాలను నాశనం చేయదని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. మన సైనిక దళాలు సాహసంతో వార్ కొనసాగిస్తున్నాయని అంటూ ఆయన వారిని ప్రశంసించారు. తన ప్రసంగంలో ఆయన తన రాజీనామా యోచన గురించి గానీ.. ప్రస్తుత పరిస్థితికి తనదే బాధ్యత అని గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. తాలిబన్లు, పాకిస్థాన్ కూడా ఘని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం. తాలిబన్ల ,మధ్య అధికార పంపిణీ జరగవచ్చునని ఇటీవల వఛ్చిన వార్తల గురించి కూడా ఆఫ్ఘన్ అధ్యక్షుడు ప్రస్తావించలేదు.

English summary
Afghan President Ashraf Ghani said the country is in serious danger of instability, while adding that he will not give up the “achievements” of the last 20 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X