• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా షాకింగ్: పేషెంట్ జీరో అమ్మాయి.. ఆమె లవర్ ద్వారా వైరస్ వ్యాప్తి.. వూహాన్ ల్యాబ్‌పై మరో సంచలనం..

|

భూగోళం మొత్తాన్నీ స్తంభింపజేసిన కరోనా వైరస్.. తన ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా రోగుల సంఖ్య 23 లక్షలు, మరణాలు 1.61లక్షలు దాటాయి. దాదాపు అన్ని దేశాల్లో వ్యవస్థల్ని కుప్పకూల్చిన ఈ వైరస్‌ను చైనానే సృష్టించిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్లే 'వూహాన్ వైరాలజీ ల్యాబ్'లో ఇదీ జరిగిందంటూ రోజుకో సంచలన కథనం వెలుగులోకి వస్తున్నది. తాజాగా, ట్రంప్ తో దగ్గరి సంబంధాలున్న 'ఫాక్స్ న్యూస్' సంస్థ చైనాలో 'పేషెంట్ జీరో'ను గుర్తిస్తూ, అసలీ విలయం ఎలా మొదలైందో వివరించే ప్రయత్నం చేసింది..

రివర్స్ థియరీ..

రివర్స్ థియరీ..

కరోనా వైరస్ ఎలా పుట్టింది? అనే ప్రశ్నకు ‘‘వూహాన్ సిటీలోని గబ్బిలాల ద్వారా అక్కడి మాంసం మార్కెట్ లో వైరస్ పుట్టింది''అని ఇప్పటిదాకా చదువుతూ వచ్చాం. కానీ.. ఏ జాతి గబ్బిలాల ద్వారా కరోనా పుట్టిందని చైనా చెబుతూవస్తున్నదో.. ఆ జాతి గబ్బిలాలు వూహాన్ సిటీలో లేనేలేవని తెలుస్తోంది. ‘‘ఆ సిటీకి కనీసం 70 కిలోమీటర్ల దూరంలోగానీ వాళ్లు(చైనా) చెబుతోన్న గబ్బిలాలు లేవు. అక్కడి మార్కెట్ లో వాటిని అమ్మలేదు కూడా. దీనికి సంబంధించి మా దగ్గర ఆధారాలున్నాయి''అని స్వయంగా ట్రంప్ మీడియాకు చెప్పారు. తద్వారా ఇన్నాళ్లూ ప్రచారంలో ఉన్నదాన్ని రివర్స్ థియరీగా కొట్టిపారేశారు.

ఓ లేడీ ద్వారా..

ఓ లేడీ ద్వారా..

వూహాన్ సిటీలోని మాంసం మార్కెట్ లో వైరస్ సోకిన గబ్బిలాన్ని కొనుగోలుచేసి, దాన్ని తిన్న వ్యక్తి నుంచి వైరస్ వ్యాప్తి చెందిందనే కథనంలో ఏమాత్రం నిజం లేదని, అమెరికా నిధులతో ఏర్పాటైన వైరాలజీ ల్యాబ్ లోనే అసలీ కథ మొదలైందని ఫాక్స్ న్యూస్ తెలిపింది. గతంలో ఒబామా ప్రభుత్వం మంజూరు చేసిన 3.7మిలియన్ డాలర్ల గ్రాంట్ తో వూహాన్ లో లెవల్-4 వైరాలజీ ల్యాబ్ ఏర్పాటైందని గుర్తుచేసింది. సదరు ల్యాబ్ అమెరికా ఫండింగ్ తో ఏర్పాటైంది కాబట్టి పెద్దన్నే వైరస్ సృష్టించాడనే అనుమానాలు మొదట్లో వ్యాప్తి చెందాయని, కానీ అక్కడ పని చేసిన ఓ లేడీ ద్వారా ఇదంతా జరిగిందని ఫాక్స్ పేర్కొంది.

కొంప ముంచిన లవర్..

కొంప ముంచిన లవర్..

వూహాన్ సిటీలోని వైరాలజీ ల్యాబ్ లో గబ్బిలాపై రకరకాల పరిశోధనలు జరిగేవని, అలా పరీక్షలు కొనసాగుతుండగా, ఒక గబ్బిలంలోని వైరస్.. అక్కడ పనిచేస్తోన్న జూనియర్ ఇంటర్న్ కు అంటుకుందని, ఆమెనే ‘పేషెంట్ జీరో(మొదట వ్యాధి సోకిన వ్యక్తి)'అని పరిశోధనలో తేలినట్లు ఫాక్స్ న్యూస్ తెలిపింది. ఆ అమ్మాయి తన లవర్ తో కలిసుండేదని, అతను మాంసం కొనేందుకు మార్కెట్ కు వెళ్లడంతో.. అక్కణ్నుంచి వైరస్ మిగతావాళ్లకు అంటుకుంటూ.. మొత్తం ప్రపంచాన్నే కబళించిందని కథనంలో పేర్కొన్నారు. అమెరికా ఫండింగ్ తో నడిచే ల్యాబ్ కాబట్టే దానిపై ట్రంప్ సర్కారు నిఘా పెట్టిందని, అక్కడేం జరిగిందో స్వయంగా పరిశీలించేందుకు అమెరికన్లను ల్యాబ్ లోకి అనుమతించాల్సిందిగా చైనాపై ఒత్తిడి పెంచుతున్నారని తెలిసింది.

జిన్ పిన్ తప్పుతో..

జిన్ పిన్ తప్పుతో..

గతేడాది డిసెంబర్ లో వైరస్ ను గుర్తించిన చైనా ప్రభుత్వం.. జనవరి 20న ఆ విషయాన్ని బహిర్గతం చేసింది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో వూహాన్ నుంచి ప్రపంచ దేశాలకు వైరస్ పాకిపోయింది. జిన్ పింగ్ చేసిన భారీ తప్పిదం వల్లే అన్ని దేశాలు ముప్పు ముంగిట నిలబడాల్సి వచ్చిందని అమెరికాకే చెందిన మరో ప్రఖ్యాత మీడియా ఏజెన్సీ ‘ఏపీ' వెల్లడించింది. తాజాగా ఆ అనుమానాలను నిర్ధారిస్తూ ఫాక్స్ న్యూస్ కథనాన్ని వెలువరించింది. ఇదేసమయంలో అమెరికాకు మద్దతుగా, చైనాకు వ్యతిరేకంగా బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా గొంతు పెంచుతుండటం గమనార్హం. చైనా గనుక ఉద్దేశ పూర్వకంగా ఈ కుట్రకు ఒడిగట్టి ఉంటే.. అది ఎదుర్కోబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.

చైనా డబుల్ గేమ్..

చైనా డబుల్ గేమ్..

కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించామని, అడపాదడపా విదేశాల నుంచి వస్తోన్న కేసులే తప్ప మరణాలు కూడా ఆగిపోయాయని చైనా ప్రభుత్వం ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చింది. కానీ, విదేశాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతుండటంతో సడెన్ గా మరణాల సంఖ్యను పెంచేసింది. అప్పటిదాకా మూడున్నర వేలు కూడా దాటని మరణాల సంఖ్యను ఏకంగా ఐదువేలకు చేరువగా పెంచిచూపడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లయింది. చైనా ద్వంద్వ విధానాలు అనుసరిస్తున్నదని అమెరికాతోపాటు చాలా దేశాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

అమెరికాలో మృత్యువిలయం..

అమెరికాలో మృత్యువిలయం..

కరోనా వైరస్ కు సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా ఉన్న అమెరికాలో మరణాలు ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం సాయంత్రం నాటికి అక్కడ కేసుల సంఖ్య 7.39లక్షలుగానూ, మరణాలు 39,015గానూ ఉన్నాయి. మరో 13,551మంది క్రిటికల్ కండిషన్ లో ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్నారు. చైనాలో ఆదివారం నాటికి కేసుల సంఖ్య 82,735గాను, మరణాలు 4,632గానూ నమోదయ్యాయి.

English summary
The initial transmission of the virus was bat-to-human, Fox News reported, adding that the 'patient zero' worked at the Wuhan Institute of Virology, Fox News reports
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X