వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై మరో షాకింగ్: రెమ్‌డెసివిర్ పనిచేయట్లేదు - మరణాలు పెరగొచ్చన్న WHO - గిలిద్ ఖండన

|
Google Oneindia TeluguNews

విలయ కాలంలో రోజులు గడుస్తున్నకొద్దీ భారత్ సహా పలు దేశాల్లో కొవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి.. దీంతో వైరస్ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నది.. శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 4కోట్లకు చేరువకాగా, మరణాల సంఖ్య 11లక్షలు దాటింది.. విరుగుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ఇతర వ్యాధుల చికిత్స కోసం వాడుతున్న కాంబినేషనల్‌ డ్రగ్స్‌ని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. కానీ అవి కూడా పనిచేయడం లేదని నిర్ధారణ కావడంతో కరోనా మరణాలు ఇంకా పెరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సంచలన వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

COVID-19 : కరోనా మరణాలను తగ్గించడంలో Remdesivir ప్రభావం లేదన్న WHO || Oneindia Telugu

సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామసీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ

రెమ్‌డెసివిర్ ప్రభావం నిల్

రెమ్‌డెసివిర్ ప్రభావం నిల్

వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కొవిడ్-19 వ్యాధికి చికిత్సలో.. యాంటీ ఎబోలా డ్రగ్ రెమ్‌డెసివిర్ ను అధికంగా వాడుతున్నారు. భారత్, అమెరికా, సింగపూర్, జపాన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో రెమ్‌డెసివిర్ వాడకాన్ని అధికారికంగానూ ఆమోదించారు. అయితే ఈ డ్రగ్.. కరోనా మరణాలను నివారించడంలో ఎలాంటి ప్రభావం చూపడంలేదని డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా బాంబు పేల్చింది. కరోనా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నవారిలో వ్యాధి ముదరకుండా ఉండటానికి మాత్రమే రెమ్‌డెసివిర్ తోడ్పడుతుంది తప్ప, తీవ్ర ప్రభావం ఉన్న రోగుల్ని మరణ ప్రమాదం నుంచి బయటపడేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

బ్లాక్‌లో ఒక్క డోసుకు రూ.30వేలు

బ్లాక్‌లో ఒక్క డోసుకు రూ.30వేలు

కొవిడ్-19 చికిత్సలో రెమ్‌డెసివిర్ ప్రాణాధారమైన మందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సహా సర్వత్రా ప్రచారం జరగడంతో ఆ డ్రగ్ ధరలు అమాంతం కొడెక్కాయి. రూ.5,400కి లభ్యమయ్యే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ డోసు కాస్తా.. బ్లాక్ మార్కెట్ లో రూ.30 వేల వరకు ధర పలికిన సందర్భాలున్నాయి. ఇటీవల కరోనా కాటుకు గురైన డొనాల్డ్ ట్రంప్ కు చికిత్సలో రెమ్‌డెసివిర్ ను అందించడం తెలిసిందే. రెమ్‌డెసివిర్ ప్రయోజనాలపై డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం చేపట్టగా...

 గిలిద్ భిన్నవాదన..

గిలిద్ భిన్నవాదన..

ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లోని 11,266 మంది కొవిడ్ పేషెంట్లకు రెమ్‌డెసివిర్ డోసులతో కూడిన 28 రోజుల చికిత్సను డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం చేసింది. రెమ్‌డెసివిర్ ను హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్, ఇంటర్ఫెరోన్ వంటి ఔషధాలతో కలిపి ఇచ్చినప్పుడు వాటి ప్రభావం స్వల్పంగానూ, కొన్ని సమయాల్లో అసలేమీ ఎఫెక్ట్ లేకుండా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ నిపుణులు గుర్తించారు. అయితే, కొవిడ్ మరణాలను నియంత్రించడంలో రెమ్‌డెసివిర్ ప్రభావం లేదన్న డబ్ల్యూహెచ్ఓ ప్రకటనను గిలిద్ ఫార్మా కంపెనీ దాదాపు ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్త అధ్యయనం వివరాలు అస్థిరంగా ఉన్నాయని, శాస్త్రీయ చర్చకు అనుకూలంగా లేవని గిలిద్ ప్రతినిధులు మీడియాతో అన్నారు.

కుప్పకూలిన వేదిక: ఐశ్వర్య రాయ్ తండ్రికి తప్పిన ప్రమాదం - తేజ్ ప్రతాప్‌తో పెళ్లి పెటాకులు -జేడీయూలోకికుప్పకూలిన వేదిక: ఐశ్వర్య రాయ్ తండ్రికి తప్పిన ప్రమాదం - తేజ్ ప్రతాప్‌తో పెళ్లి పెటాకులు -జేడీయూలోకి

English summary
Anti-viral drug remdesivir has little to no effect on Covid patients' chances of survival, a study from the World Health Organization has found. The WHO trial evaluated four potential medications for Covid-19, including remdesivir and hydroxychloroquine. Remdesivir was among the first to be used to treat coronavirus, and was recently given to US President Donald Trump when he was in hospital. The drug's manufacturer Gilead rejected the findings of the trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X