Gamma Variant : రష్యాలో బయటపడ్డ కోవిడ్ గామా వేరియంట్...

రష్యాలో కోవిడ్‌ గామా వేరియంట్ బయటపడింది. మొట్టమొదటిసారిగా ఇది బ్రెజిల్‌లో బయటపడగా.. తాజాగా రష్యాలోనూ స్వల్పంగా దీని ఆనవాళ్లు వెలుగుచూసినట్లు అక్కడి న్యూస్ ఏజెన్సీ ఇంటర్‌ఫాక్స్ వెల్లడించింది.

'రష్యాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ విస్తృతంగా వ్యాపించింది.పలుచోట్ల గామా వేరియంట్ కేసులు గుర్తించబడ్డాయి.' అని ఇంటర్‌ఫాక్స్ వెల్లడించింది. ఎపివాక్‌కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసిన సైబీరియాలోని వెక్టార్ ఇన్‌స్టిట్యూట్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. డెల్టా,గామా వేరియంట్లు ఆందోళనకర వేరియంట్లు అని... ఇవి మిగతా వాటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతాయని ఆ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. అంతేకాదు,శరీరంలో యాంటీబాడీస్‌పై కూడా ఇవి ప్రభావం చూపుతాయని తెలిపింది.

covid variant gamma detected in russia says interfax news agency

ప్రస్తుతం రష్యాలో డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండటమే కేసుల పెరుగుదలకు కారణమన్న వాదన వినిపిస్తోంది. గురువారం(జులై 22) ఒక్కరోజే దేశంలో దాదాపు 24,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 796 మంది కరోనాతో మృతి చెందారు. డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో గామా వేరియంట్ ఆనవాళ్లు కూడా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

కోవిడ్ వేరియంట్ P.1కి గామా వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ వేరియంట్ B.1.617.2ను 'డెల్టా' వేరియంట్‌గా,మరో వేరియంట్ B.1.617.1 'కప్పా' వేరియంట్‌గా,B.1.351ని 'బీటా'గా,B.1.525 వేరియంట్‌ను 'ఈటా'గా,P.3 వేరియంట్‌ను థెటాగా,B.1.526 వేరియంట్‌ను లొటాగా నామకరణం చేసింది. గామా వేరియంట్‌ను తొలిసారిగా గతేడాది బ్రెజిల్‌లో గుర్తించగా... డెల్టా వేరియంట్‌ను తొలిసారిగా భారత్‌లో గుర్తించారు. డెల్టా వేరియంట్ నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ కూడా పుట్టుకొచ్చింది. వైరస్ వేగంగా మ్యుటేషన్ చెందుతుండటంతో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+