వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోమాత గ్రేట్: అవు రోగ నిరోధక శక్తి స్ఫూర్తిగా కొత్త చికిత్సలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అవులలో రోగ నిరోధక శక్తిని అధ్యయనం చేయడం ద్వారా మనుష్యులకు వచ్చే పలురకాల వ్యాధులకు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముక్యంగా హార్మోన్ లోపాలను ఎదుర్కొంటున్న వారికి కొత్త చికిత్సను అందించేందుకు ఇదొక మంచి మార్గంగా భావిస్తున్నారు.

గోమాతను దేవతగా పూజించడం భారతీయ సనాతన ధర్మం. అదే ఆవు పంచితం, పాలు ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. అమెరికా పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు. అచ్చం ఆవు యాంటీబాడీల్లాగే పనిచేసే ఓ కొత్త యాంటీబాడీని ది స్ర్కిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ఈ యాంటీబాడీలను మానవ హార్మోన్లతో జతచేయడం ద్వారా సత్ఫలితాలొచ్చాయని చెప్పారు. ఈ హార్మోన్‌ సమస్యలే కాదు భవిష్యత్తులో ఇతర జబ్బుల చికిత్సకు ఇది మార్గం సుగమం చేస్తుందని పరిశోధకుడు టావో ల్యూ చెప్పారు. ఇది మహిళల్లో ఎదుగుదల సమస్యకు, ఇతరత్రా హార్మోన్‌ సమస్యలకు చెక్‌పెడుతుందని చెబుతున్నారు.

Cow immune system inspires new therapies for humans

సాధారణంగా గ్రోత్‌ హార్మోన్‌ (హెచ్‌జీహెచ్‌) ప్రభావం శరీరంలో 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వారు రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాల్సి వస్తుండడం వల్లే దీనిని రూపొందించామని ఆయన చెబుతున్నారు. గోవు యాంటీబాడీలపై పరిశోధనల ఫలితాలే ప్రేరణనిచ్చాయన్నారు.

దాని నిర్మాణం అసమానమని, ప్రత్యేకమైనదని చెప్పారు. ఏదో ఓ రోజు ఈ కృత్రిమ అణువు మానవుడి వివిధ చికిత్సలకు కీలకంగా మారుతుందన్నారు. అవులో అరుదైన ఆకృతిలో ఉండే యాంటీబాడీ అనువుగా ఉండటంతో దానిలాంటి యాంటీబాడీని రూపొందిెచి.. హెచ్‌జీహెచ్ హార్మోన్‌తో జతచేశారు.

దీనిని ఎలుకల పైన పరీక్షించి చూసినప్పుడు శరీరంలో నిలకడగానే ఉంటూనే హార్మోన్ తన ప్రభావాన్ని చూపించిందని, ఈ నేపథ్యంలో మనుష్యుల్లోను ఉపయోగించడానికి వీలుగా దీనిలో మార్పులు తీసుకురావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

English summary
Scientists have developed a potential new therapy based on immune molecules from cows to help people with hormone deficiencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X