వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌కు షాక్! 70ఏళ్లలో తొలిసారి: ఐసీజే సభ్యుడిగా భండారీ మరోసారి ఎన్నిక

అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) సభ్యుడిగా జస్టిస్‌ దల్వీర్‌ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. మూడింట రెండొంతులకుపైగా ఐక్యరాజ్యసమతి సభ్యదేశాలు ఆయనవైపే మొగ్గుచూపాయి. దీంతో బ్రిటన్‌ పోటీ నుంచి తప్ప

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) సభ్యుడిగా జస్టిస్‌ దల్వీర్‌ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. మూడింట రెండొంతులకుపైగా ఐక్యరాజ్యసమతి సభ్యదేశాలు ఆయనవైపే మొగ్గుచూపాయి. దీంతో బ్రిటన్‌ పోటీ నుంచి తప్పుకొంది.

 భండారీకి ఓట్లు.. బ్రిటన్ సభ్యత్వం..

భండారీకి ఓట్లు.. బ్రిటన్ సభ్యత్వం..

ఐక్యరాజ్యసమితిలో సోమవారం ఈ ఎన్నికలు జరిగాయి. సర్వప్రతినిధి సభలో 193 ఓట్లకుగాను 183... భద్రతా మండలిలో 15 ఓట్లు భండారీకేపడ్డాయి. దీంతో తొలిసారిగా ఐసీజే ధర్మాసనంలో బ్రిటన్‌కు సభ్యత్వం లేకుండాపోయింది.

70ఏళ్లలో తొలిసారి..

70ఏళ్లలో తొలిసారి..

గత 70ఏళ్లలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం.. తాతాల్కిక సభ్యదేశం చేతిలో ఓటమిపాలవ్వడమూ ఇదేతొలిసారి. ఈ నేపథ్యంలో ఈ పరిణామం తమ దేశానికి అవమానకరమని బ్రిటన్‌ మీడియా వ్యాఖ్యానించింది.

 భారత్‌కు మద్దతుగానే..

భారత్‌కు మద్దతుగానే..

భారత్‌కు మద్దతు పలకాలనే విదేశాంగ విధానంలో భాగంగానే తమ అభ్యర్థిని వెనక్కు తీసుకున్నామని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంటులో చెప్పడం గమనార్హం.

 గర్వ కారణం.. ధన్యవాదాలు

గర్వ కారణం.. ధన్యవాదాలు

కాగా, భండారీ విజయం కోసం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఎంతగానో కృషిచేశారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. భండారీ తిరిగి ఎన్నిక కావడం మనకు ఎంతో గర్వ కారణమని ఆయన అన్నారు. భారతదేశానికి మద్దతుగా నిలిచిన ఇతర దేశాలకు ఈ సందర్బంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.

English summary
Dalveer Bhandari's win at the International Court of Justice was a Herculean task. India adopted a strategy which saw Justice Bhandari make it to the ICJ.
Read in English: Dalveer Bhandari in ICJ
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X