వరల్డ్ నం.2: గ్యాంగ్ స్టర్ దావూద్ ఆస్తులపై ఫోర్బ్స్ మేగజైన్, నం.1 ఎవరంటే?

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడైన నేరస్తుడని ఫోర్బ్స్ మేగజైన్ పేర్కొంది. బ్రిటన్‌లో దావూద్ ఆస్తుల జప్తు నేపథ్యంలో అతని ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

డ్రగ్ మాఫియాలో కొకైన్ కింగ్‌గా పిలవబడే ఎస్కోబార్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. అమెరికాలో వాడుతున్న సుమారు 80శాతం డ్రగ్స్ ఎస్కోబార్ గ్యాంగ్ నుంచే సరఫరా అవుతున్నట్లు చెప్పుకొచ్చింది. డైలీ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1990ల నాటికే ఎస్కోబార్ 30బిలియన్ డాలర్ల విలువైన సంపదలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

 Dawood Ibrahim is 2nd richest gangster of all time. Guess who's the richest one!

ఇక దావూద్ ఇబ్రహీం విషయానికొస్తే.. 2015నాటికి 6.7బిలియన్ డాలర్ల విలువ చేసే నికర ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. కాగా, పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతంలో ఉన్న క్లిఫ్టన్ ప్రాంతం నుంచి దావూద్ తన క్రైమ్ నెట్ వర్క్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.

దావూద్ పేరుమీద వార్‌విక్‌షైర్‌లో ఓ ఖ‌రీదైన హోట‌ల్ కూడా ఉంది. మిడ్‌ల్యాండ్స్‌లోనూ అనేక రెసిడెన్స్ ప్రాప‌ర్టీలు ఉన్నాయి. ముంబై పోలీస్ కుటుంబంలో పుట్టిన దావూద్ అక్క‌డే డీ కంపెనీ పేరుతో తన నేర సామ్రాజ్యాన్ని మొదలుపెట్టాడు. క్రమక్రమంగా దాన్ని విస్తరించుకుంటూ 16దేశాల్లో పాగా వేయగలిగాడు. దావూద్ కు మొత్తం 21మారు పేర్లు ఉన్నాయి.

ప్ర‌స్తుతం దావూద్ త‌ల‌పై రూ.160 కోట్ల న‌జ‌రానా ఉంది. మిడ్‌ల్యాండ్స్‌లో ఉన్న దావూద్ రెసిడెన్స్ ప్రాప‌ర్టీల‌పై ప్ర‌స్తుతం బ్రిట‌న్ ప్ర‌భుత్వం నిఘా పెట్టింది. దావూద్‌కు చెందిన కొన్ని ఫైల్స్‌ను 2015లో బ్రిట‌న్‌కు భార‌త్ అంద‌జేసింది. భార‌త్ ఇచ్చిన ఆధార‌లతోనే గ్యాంగ్‌స్ట‌ర్‌ దావూద్ ఆస్తుల‌ను బ్రిట‌న్ సీజ్ చేసింది. దీంతో ఇది భారత్ దౌత్యపరంగా సాధించిన విజయమని పలువురు పేర్కొంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dawood Ibrahim, India's most wanted terrorist, is the second richest criminal to have ever lived.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి