దావూద్ మా వద్ద లేడు: షిండే ప్రకటనపై పాక్

దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని తాము భారత్‌కు పదే పదే చెబుతూ వస్తున్నామని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల కార్యాలయం అధికార ప్రతినిధి తస్నీమ్ అస్లామ్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. ఎప్పుడై దావూద్ పాకిస్తాన్‌లో ఉన్నాడా అని అడిగితే గతంలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని, తాము పరిశీలించి దావూద్ తమ దేశంలో లేడని చెప్పామని ఆయన అన్నారు.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని భారత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. అమెరికాతో కలిసి సంయుక్త ప్రయత్నంతో దావూద్‌ను పట్టుకుంటామని ఆయన చెప్పారు. తమకున్న సమాచారం మేరకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
నిరుడు అమెరికా వెళ్లినప్పుడు ఎఫ్‌బిఐ వ్యవహారాలు చూసే అటార్నీ జనరల్‌ను కలిశానని, తాను ఆయనతో మాట్లాడానని, దావూద్‌కు సంబంధించిన సమాచారం పరస్పరం మార్పిడి చేసుకోవాలని అనుకున్నామని షిండే చెప్పారు.


Click it and Unblock the Notifications