దావూద్ ఆస్తుల వేలం: తగలబెట్టేందుకే కారు కొన్నాడు
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం వేలంపాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సీజ్ చేసిన ఆస్తులను వేలం వేస్తారు. అయితే ఆ ఆస్తులు దావూద్‌వి కావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భయపడుతున్నారు.
అసలు దావూద్ ఆస్తులకు వేలంపాట నిర్వహిస్తారా? అనే చర్చ కూడా జరిగింది. ముంబై, పరిసర ప్రాంతాల్లో దావూద్ ఇబ్రహీంకు చెందిన కోట్లు విలువచేసే ఏడు ప్రాపర్టీస్‌కి వేలంపాట నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ వేలంలో పాల్గొనేందుకు లాయర్లు, మాజీ జర్నలిస్టులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ వేలం పాట దక్షిణ ముంబైలోని హోటల్ డిప్లోమాట్‌లో జరుగుతోంది. ముంబైకి చెందిన జర్నలిస్ట్ బాలకృష్ణన్, ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాత్సవలతో పాటు హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి కూడా ఆస్తులు కొనుగోలు చేసేందుకు బిడ్ వేశారు.

దావూద్.. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయాడు. అతడు ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నాడు. అయితే ముంబై దాడుల తర్వాత అతడికి చెందిన ఓ రెస్టారెంటును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలోని పాక్మోడియా ప్రాంతానికి చెందిన భెందీ బజార్‌లో ఢిల్లీ జెయికా పేరిట నిర్మితమైన సదరు రెస్టారెంట్ దావూద్‌కు చెందినదిగానే పోలీసులు భావిస్తున్నారు. దీనిని వేలం వేయనున్నారని తెలుస్తోంది. ఈ హోటల్‌కు వేలంలో ప్రారంభ ధర రూ.1.18 కోట్లుగా నిర్ణయించారు.
కారు కాల్చేందుకు కొనుగోలు: హిందూ మహాసభ నేత
దావూద్ ఇబ్రహీం కారును తగులబెట్టేందుకే దానిని తాను సొంతం చేసుకున్నానని హిందూ మహాసభ అధ్యక్షులు చక్రపాణి అన్నారు. దావూద్ కారుకు నిర్వహించిన వేలం పాటలో సుమారు రూ.3.2 లక్షలు చెల్లించి ఆ కారును ఆయన సొంతం చేసుకున్నారు.
హ్యుందాయ్ యాక్సెంట్ (ఎంహెచ్-04-ఏఎక్స్-3676) కారు వేలం తొలి పాట రూ.15,700తో ప్రారంభమైంది.
గత నాలుగేళ్లుగా ఘట్ కోపర్‌లోని గవర్నమెంట్ సొసైటీ వద్ద ఈ గ్రీన్ సెడాన్ కారును పార్కింగ్ ప్రాంతంలో ఉంచారు.
గాలి లేని టైర్లతో ఉన్న ఈ కారు బాడీ షేప్ కూడా సరిగ్గా లేదు. కాగా, స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్ల యాక్టు- 1976ను అనుసరించి ఈ వేలం పాటను నిర్వహించారు. ఇందుకోసం ఒక ప్రయివేటు సంస్థను ప్రభుత్వం నియమించింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications