చైనాలో డేంజరస్ బ్యాక్టీరియా లీక్... పురుషులపై తీవ్ర ప్రభావం..ఇతర దేశాలకు వ్యాపిస్తుందా..?
చైనా: కరోనా బ్యాక్టీరియాకు కేరాఫ్‌గా నిలిచింది చైనా. చైనాలోనే తొలి కరోనాబ్యాక్టీరియా బయటపడి ఆ తర్వాత ప్రపంచ దేశాలకు పాకింది. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా చైనాను మరో బ్యాక్టీరియా పట్టి పీడిస్తోంది. ఇది ఏకంగా మగవారి పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంతకీ ఆ బ్యాక్టీరియా ఏంటి..?
Recommended Video

కొత్త బ్యాక్టీరియా బ్రూసెల్లాసిస్
వాయువ్య చైనాను కొత్త బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా పేరు బ్రూసెల్లాసిస్. ఇప్పటికే వెయ్యిమందికి పైగా ఈ బ్యాక్టీరియా బారిన పడి అల్లాడుతున్నారు. వీరందరికీ పాజిటివ్‌గా తేలింది. గతేడాది బయో ఫార్మాషూటికల్ కంపెనీ నుంచి లీక్ అయిన రసాయనాల వల్లే ఈ బ్యాక్టీరియా మనుషులకు హానీ చేకూరుస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు బ్రూసెల్లాసిస్ బ్యాక్టీరియా బారిన 3245 మంది పడ్డట్టు అధికారులు చెప్పారు. ఈ బ్యాక్టీరియా ముందుగా జంతువులకు సోకి ఆ తర్వాత మనుషులకు వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ బ్యాక్టీరియా పురుషుల వృషణాలను దెబ్బతీసి వారి సంతాన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తోంది.

అమెరికా పరిశోధకులు ఏం చెబుతున్నారు..
బ్రూసెల్లాసిస్ బ్యాక్టీరియాకు మాల్టా ఫీవర్ లేదా మెడిటెరేనియన్ ఫీవర్ అని కూడా పిలుస్తారని అమెరికాలోని సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ వెల్లడించింది. ఈ బ్యాక్టీరియా మనుషుల్లో విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసటను తీసుకొస్తుందని అమెరికా సంస్థ పేర్కొంది.బ్రూసెల్లాసిస్ బ్యాక్టీరియా అంటుకుంటే క్రమంగా తగ్గిపోతుందని కొన్ని సార్లు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఆర్థ్రిటిస్, వాపులు, కొన్ని శరీర అవయవాల్లో వాపులు కనిపిస్తాయని స్పష్టం చేశారు.

ఓ ఫార్మా కంపెనీ నుంచి లీక్
ఇక ఒక మనిషి నుంచి మరో మనిషికి ఈ వ్యాధి సోకడం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పిన వైద్యులు... ఎక్కువగా కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల, లేదా బ్యాక్టీరియాను పీల్చడం ద్వారా వ్యాధి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం వాయువ్య చైనాలో బ్యాక్టీరియాను పీల్చడం వల్లే వచ్చిందని వెల్లడించారు. గతేడాది జూలై -ఆగష్టు మధ్య జోంగ్మూ లాన్జౌ బయలాజికల్ ఫార్మాష్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి బ్యాక్టీరియా లీక్ అయ్యిందని ప్రముఖ పత్రిక సీఎన్ఎన్ కథనాన్ని ప్రచురించింది. పశువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన తయారు చేస్తున్న క్రమంలో కొన్ని ఎక్స్‌పైర్ అయిన డిస్‌ఇన్ఫెక్టెంట్లు, శానిటైజర్లను వినియోగించడం జరిగిందని కథనంలో పేర్కొంది. అయితే వ్యర్థ వాయువులను విడుదల చేసినప్పుడు కొంత బ్యాక్టీరియా ఇందులో కలవడం... దీన్ని అక్కడి ప్రజలు పీల్చడం వల్ల వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు నమోదు కాని మరణాలు
ముందుగా కొంతమంది మాత్రమే ఈ బ్యాక్టీరియా బారిన పడినట్లు సమాచారం. కానీ 21,000 మందికి పరీక్షలు నిర్వహించగా దీని బారిన పడిన వారి సంఖ్య అమాంతం పెరిగిపోయిందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు బ్రూసెల్లాసిస్ బారిన పడి మరణించిన వారు ఎవరూ లేరని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారి సంఖ్య అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. అంతేకాదు ఈ కొత్త వ్యాధి మళ్లీ ఎంతవరకు ప్రమాదకరంగా మారుతుందోనని వైద్యులు భయపడుతున్నారని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications