Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాలిబన్ల విజయంతో కొత్త చర్చ-ఆప్ఘన్ ఎవరికి సొంతం ? ఏది స్వాతంత్రం ?

ఆప్ఘనిస్తాన్ లో దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన పాశ్చాత మద్దతు కలిగిన పాలనకు చరమగీతం పాడి అధికారాన్ని కైవసం చేసుకున్నారు తాలిబన్లు. దీంతో సహజంగానే పాశ్చాత్య దేశాలతో పాటు వాటికి మద్దతిస్తున్న దేశాలు, ఐక్యరాజ్యసమితి వంటి సంస్ధలు దీనిపై మండిపడుతున్నాయి. తాలిబన్ల పాలనను గుర్తించబోమంటున్నాయి. భారత్ దీ ఇదే ధోరణి. కానీ తాలిబన్ల విజయంపై పలు ముస్లిం దేశాల నుంచి మాత్రం భిన్నమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా తాలిబన్ల పాలనలోకి వెళ్లిన ఆప్ఘనిస్తాన్ కు స్వాతంత్రం లభించిందా లేక దూరమైందా అన్న చర్చ సాగుతోంది.

Recommended Video

    #Afghanistan Crisis: UK PM Boris Johnson Blames US | Oneindia Telugu
     ఆప్ఘనిస్తాన్ చరిత్ర

    ఆప్ఘనిస్తాన్ చరిత్ర

    ఆప్ఘనిస్తాన్ చరిత్రను గమనిస్తే సుస్దిర ప్రభుత్వాలు, స్వదేశీ పాలన వంటి పదాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా 19, 20వ శతాబ్దాల్లో ఆప్ఘనిస్తాన్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ (సామ్రాజ్యాల స్మశానం)గా పేరు తెచ్చుకుంది. లెక్కలు మిక్కిలిగా సామ్రాజ్యాలు, విభిన్నసంస్కృతీ సంప్రదాయాలు, విదేశీ పాలనలో ఉండిపోయిన ఆప్ఘనిస్తాన్ ను ఎప్పుడు ఎవరెవరు పాలించారో కూడా కచ్చితంగా చెప్పాలంటే లెక్కలు, ఆధారాలు కూడా దొరకని పరిస్ధితులు చరిత్రలో కనిపిస్తాయి. మరోలా చెప్పాలంటే ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించి అక్కడ పాలించిన వారిలో విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. ఇండో, ఇరాన్, మొగల్, జోరాస్ట్రియన్, పాశ్చాత్య పాలనలో మగ్గిపోయిన ఆప్ఘనిస్తాన్ ఆధునిక కాలంలో మాత్రం పష్తూన్లు, తాలిబన్లు, పాశ్చాత్య దేశాల మద్దతు కలిగిన ప్రభుత్వాల పాలనలోకి వచ్చింది ఇప్పుడు మరోసారి తాలిబన్లు పూర్తిస్ధాయిలో ఆప్ఘన్ పై పట్టు సాధించారు.

     తాలిబన్ల శకం ఆరంభం

    తాలిబన్ల శకం ఆరంభం

    తాజాగా ఆప్ఘనిస్తాన్ లోని విదేశాల మద్దతు కలిగిన అష్రఫ్ ఘనీ సర్కార్ ను కూల్చివేసి దేశాన్ని ఆక్రమించిన తాలిబన్లు తన పాలనను ప్రారంభించబోతున్నారు. ఇప్పటివరకూ అమెరికా, బ్రిటన్ తో పాటు పాశ్చాత్య దేశాల మద్దతుతో రెండు దశాబ్దాలుగా పాలన సాగించిన ప్రభుత్వాలకు కాలం చెల్లింది. మారుతున్న పరిస్దితుల్లో విదేశాల్లో తమ సైన్యాన్ని మోహరించడం ఆర్ధికంగా భారం కావడంతో పాశ్చాత్య దేశాలు క్రమంగా తమ సైన్యాల్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో సహజంగానే అక్కడ గాలి మేడల్లో ఉన్న ప్రభుత్వం కాస్తా కుప్పకూలిపోయింది. అదే సమయంలో స్వతహాగా స్ధానికులైన తాలిబన్లు అక్కడ పాగా వేయడం ప్రారంభమైంది. రెండు దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాల మద్దతు కలిగిన ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వంతో పోరాడుతున్న తాలిబన్లు విదేశీ సైన్యాలు వెళ్లిపోవడంతో ఆ దేశంపై పట్టు సాధించగలిగారు.

     ఆప్ఘన్ కు స్వాతంత్రం వచ్చిందా ? పోయిందా

    ఆప్ఘన్ కు స్వాతంత్రం వచ్చిందా ? పోయిందా

    ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించి, ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు భయభ్రాంతులవుతున్నట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆప్ఘనిస్తాన్ కు స్వాతంత్రం పోయినట్లేననే ప్రచారం మొదలైంది. కానీ విదేశీ మద్దతు కలిగిన ప్రభుత్వం కూలిపోయి స్ధానికులైన తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం స్వాతంత్రం కాక పరతంత్రం ఎలా అవుతుందనే చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా ముస్లిం, అరబ్ దేశాలు ఆప్ఘనిస్తాన్ లో తాజా పరిణామాల్ని స్వాతంత్ర్యంగానే పరిగణిస్తున్నాయి. దీంతో ఆప్ఘన్ లో స్వాతంత్ర్యం అనే అంశం మరోసారి తెరపైకి వస్తోంది.

     తాలిబన్ల రాకతో స్వదేశీ పాలన

    తాలిబన్ల రాకతో స్వదేశీ పాలన

    స్వతహాగా ఆప్ఘనిస్తాన్ కే చెందిన తాలిబన్లు హింసాత్మకంగా ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించారన్న కారణంతో ఆ దేశానికి స్వాతంత్ర్యం పోయినట్లు ఇప్పటివరకూ అక్కడ పాగా వేసిన విదేశీ ప్రభుత్వాలు, వాటి అధినేతలు, వారికి మద్దతిస్తున్న దేశాలు, ఐక్యరాజ్యసమితి గగ్గోలు పెడుతున్నాయి. కానీ ఆప్ఘనిస్తాన్ లో విదేశీ సైన్యాల మద్దతుతో ఇన్నేళ్లు పాలన సాగించిన ప్రభుత్వాలతో పోలిస్తే స్ధానికులైన తాలిబన్ల ఆధిపత్యం స్వదేశీ పాలన కిందకే వస్తుందనే వాదన ముస్లిం దేశాల నుంచి వినిపిస్తోంది. అదే సమయంలో తాలిబన్లు కూడా ఆప్ఘనిస్తాన్ కు స్వాతంత్ర్యం తెచ్చినట్లే చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకూ విదేశీ ప్రభుత్వాల పాలనలో మగ్గిన ఆప్ఘనిస్తాన్ కు అసలైన స్వాతంత్రం తెస్తున్నట్లు తాలిబన్లు చెప్తున్నారు.

     తాలిబన్లపై అభ్యంతరాలివే

    తాలిబన్లపై అభ్యంతరాలివే

    ఆప్గనిస్తాన్ లో విదేశీ ప్రభుత్వాల మద్దతున్న ప్రభుత్వం కుప్పకూలడంతో తాలిబన్ల పాలన ప్రారంభం కాబోతోంది. అయితే గతంలో తాలిబన్లు వ్యవహరించిన తీరుతో వారికి దేశ, విదేశాల్లో చెడ్డ పేరు వచ్చింది. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ, ఇతర అంశాల్లో షరియత్ చట్టాల్ని అనుసరించాలన్న వారి ధోరణి ప్రస్తుత ఆధునిక ప్రపంచ ధోరణులకు విరుద్ధంగా ఉంది. దీంతో గతంలో తాలిబన్లు షరియత్ చట్టాల్ని పాటించని వారిని పొట్టనపెట్టుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. ఆప్ఘన్ గడ్డను ఏలడం ఎంత ముఖ్యమో అక్కడి ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడం కూడా అంతే అవసరం. దీంతో తాలిబన్లు కూడా తమ విధానాలు పాటిస్తూనే హింసకు దూరంగా ఉంటామని చెప్తున్నారు. కానీ తమ విధానాలకు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంపైనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

     తాలిబన్ల భవిష్యత్ వ్యూహమిదే ?

    తాలిబన్ల భవిష్యత్ వ్యూహమిదే ?

    ఆప్ఘనిస్తాన్ భూభూగాన్ని దాదాపుగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని కేంద్రంగా చేసుకుని పాలన సాగించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పాశ్చాత్య దేశాలతో పాటు వాటికి మద్దతిస్తున్న దేశాలు కూడా తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నాయి. కానీ స్వదేశీ పాలనలో ప్రజలతో తాలిబన్లు వ్యవహరించే తీరును బట్టే వారి అధికారం అధారపడి ఉండబోతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా మద్దతు సంపాదించాలంటే అక్కడ ప్రజల మద్దతు పొందడం వారికి చాలా అవసరం. కాబట్టి హింసాత్మక పద్ధతుల్ని వదిలిపెట్టి ప్రజా రంజక పాలనకు తాలిబన్లు సిద్ధపడవచ్చని తెలుస్తోంది. ఇందుకు వారికి అవసరమైన నిధులు కూడా అందుబాటులో ఉండటంతో ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. దీంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యల్ని తీసుకునేందుకు తాలిబన్లు సిద్ధపడుతున్నారు. అదే సమయంలో ముస్లిం దేశాల మద్దతు వారికి ఎలాగో ఉండనే ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+