వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదాన్ని మతం నుంచి వేరు చేయాలి: మోడీ

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: ఉగ్రవాదం ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని, దాన్ని మతం నుంచి వేరు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పెనుభూతానికి ఏ దేశమూ ఆశ్రయం ఇవ్వరాదంటూ పరోక్షంగా పాకిస్థాన్‌కు సందేశమిచ్చారు.

ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ఉగ్రవాదానికి 'నియామక క్షేత్రం'గా ఇంటర్నెట్‌ మారకుండా చూడాలని కోరారు. ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా యువతను ఇంటర్నెట్ ద్వారా ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

ఇటీవల పలు దేశాల్లో వరుసగా సాగిన భీతావహ ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ తీవ్రవాదం ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితమైన సమస్య ఎంతమాత్రం కాదని చెప్పారు. దాని పడగ నీడ ప్రపంచం మొత్తాన్నీ కమ్మేసిందన్నారు.

భిన్నత్వంలో ఏకత్వమే బలం

భిన్న మతాలు, కులాల సహజీవన వైవిధ్యమే భారతకు తిరుగులేని శక్తి అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. దేశంలో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆదివారం ఇక్కడ ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడిన ఆయన.. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ లక్షణమన్నారు. భాషలు, మతాలు, కులాలు సమ్మిళితంగా జీవిస్తున్న దేశం భారత్ అని పేర్కొన్నారు.

దేశ పౌరులకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు పూర్తి రక్షణ ఇస్తున్నామని తెలిపారు. వీటికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, ఏ మాత్రం తేడా ఉన్నా పౌరుల హక్కుల రక్షణకు న్యాయస్థానాలు ఉన్నాయన్నారు. వణక్కం అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టి ముప్పావు గంటపాటు మాట్లాడిన మోడీ వర్తమాన భారత అభివృద్ధి అవకాశాల నుంచి ఐసిస్, అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇంటర్‌నెట్ తీవ్రవాదం వంటి అనేక అంశాలను ప్రస్తావించారు.

కొందరికి అసలు భారత దేశం ఎదగడం ఎంతమాత్రం ఇష్టమేలేదని మోడీ తెలిపారు. కానీ, నేటి భారతం సమైక్యతకు నిలయంగా భాసిల్లడంతో పాటు భిన్నత్వంలో ఏకత్వం నుంచే ఎప్పటికప్పుడు ఎనలేని శక్తిని పొందుతోందని అన్నారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత దేశం 7.5శాతం వృద్ధితో ముందుకు దూసుకుపోతోందన్నారు.

భారత దేశం ఈ స్థాయికి చేరుకోవడం ఎందరో నేతల కృషి ఫలితమేనని తెలిపారు. వర్తమాన భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని విధాలుగా గుణాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాము పగ్గాలు చేపట్టామన్నారు. ఆధునిక ఆర్థిక అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడం ద్వారా పేదరిక నిర్మూలనా లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్నామన్నారు.

బ్యాంకులు, బీమా సేలను దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేసిన మోడీ ‘కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 190మిలియన్ బ్యాంకు ఖాతాలు తెరుకుకోవడం అన్నది భారత్‌లో తప్ప ప్రపంచంలో మరెక్కడైనా జరిగిందా'అని ప్రశ్నించారు. అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణలో భారత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, ప్రాంతీయ భద్రత, సుస్థిరతకు దేశ సైనిక దళాలు గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని చెప్పారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఉగ్రవాదం ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని, దాన్ని మతం నుంచి వేరు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

మోడీ ఫొటోలు తీస్తూ..

మోడీ ఫొటోలు తీస్తూ..

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఆ పెనుభూతానికి ఏ దేశమూ ఆశ్రయం ఇవ్వరాదంటూ పరోక్షంగా పాకిస్థాన్‌కు సందేశమిచ్చారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆదివారం కౌలాలంపూర్‌లో జరిగిన తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ఉగ్రవాదానికి 'నియామక క్షేత్రం'గా ఇంటర్నెట్‌ మారకుండా చూడాలని కోరారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా యువతను ఇంటర్నెట్ ద్వారా ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఇటీవల పలు దేశాల్లో వరుసగా సాగిన భీతావహ ఉగ్రవాద దాడులను ప్రస్తావిస్తూ తీవ్రవాదం ఇప్పుడు ఒక ప్రాంతానికే పరిమితమైన సమస్య ఎంతమాత్రం కాదని చెప్పారు. దాని పడగ నీడ ప్రపంచం మొత్తాన్నీ కమ్మేసిందన్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మలేషియాలోని భారత సంతతి వారిని ఉద్దేశించి మరో కార్యక్రమంలో మాట్లాడారు. రెండు చోట్లా ఉగ్రవాద భూతాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. మలేషియా అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెషన్‌ సెంటర్‌లో 15వేల మందిని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. ఉగ్రవాదానికి ఇప్పుడు ఎల్లలు లేవని చెప్పారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భిన్న మతాలు, కులాల సహజీవన వైవిధ్యమే భారతకు తిరుగులేని శక్తి అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. దేశంలో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆదివారం ఇక్కడ ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడిన ఆయన.. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ లక్షణమన్నారు.

English summary
Warning that terrorism is the "biggest threat" to the world, Prime Minister Narendra Modi today said it should be delinked from religion as he pitched for new global anti-terror strategies while ensuring that no country gives sanctuary to it, a veiled reference to Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X