• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నో టార్చర్, హ్యాపీగానే ఉన్నా, కొద్దిరోజుల్లో విడుదలవుతా..: సౌదీ యువరాజు తలాల్

By Ramesh Babu
|

రియాధ్/సౌదీ అరేబియా: తననెవరూ హింసించడం లేదని, తాను సంతోషంగానే ఉన్నానని అక్రమాస్తులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్బంధంలో ఉన్న సౌదీ యువరాజు అల్ వాలీద్ బిన్ తలాల్ వెల్లడించారు.

ప్రభుత్వం నిర్బంధించిన రెండు నెలల తర్వాత మొట్టమొదటిసారిగా యువరాజు తలాల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన.. కొన్ని విషయాలను బయటకు వెల్లడించారు. తనను హింసిస్తూ విచారిస్తున్నారన్న వార్తలన్నీ అవాస్తవాలన్నారు.

 రాజవంశీయులను స్టార్ హోటల్లో ఉంచి...

రాజవంశీయులను స్టార్ హోటల్లో ఉంచి...

అక్రమాస్తుల, అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతేడాది నవంబర్ మొదటి వారంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు మంత్రులు, సౌదీ రాజకుటుంబీకులు, వ్యాపారవేత్తలు దాదాపు 200 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో రాజవంశీయులను ఓ స్టార్ హోటల్‌లో ఉంచి విచారిస్తున్నారు.

 బిలియనీర్ తలాల్ అరెస్టుతో ఉలిక్కిపడిన సౌదీ...

బిలియనీర్ తలాల్ అరెస్టుతో ఉలిక్కిపడిన సౌదీ...

ఇలా అరెస్టయిన వారిలో 17 బిలియన్ డాలర్లు(లక్ష కోట్ల రూపాయలకు పైగానే) ఆస్తి కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన అల్ వాలీద్ బిన్ తలాల్ కూడా ఉన్నారు. పలు దేశాల అధ్యక్షులతో నేరుగా మాట్లాడగలిగేంత స్థాయి ఉన్న తలాల్‌ను అరెస్ట్ చేయడంతో సౌదీ అరేబియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 నన్నెవరూ హింసించడం లేదు...

నన్నెవరూ హింసించడం లేదు...

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు అరెస్టయిన రాజవంశీలకుల్లో యువరాజు అల్ వాలీద్ బిన్ తలాల్‌ను చిత్రహింసలు పెడుతూ విచారిస్తున్నారనే వదంతులు వచ్చాయి. దీంతో ఆయన నేరుగా ఓ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు వెల్లడించారు. తననెవరూ చిత్రహింసలు పెట్టడం లేదని, గతంలో ఎలాంటి జీవితాన్ని అనుభవించానో ఇప్పుడుకూడా అదేవిధంగా జీవిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపార మిత్రులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదన్నారు.

త్వరలోనే విడుదలవుతా...

త్వరలోనే విడుదలవుతా...

‘ప్రభుత్వ అధికారులకు.. నాకు మధ్య కొన్ని చర్చలు జరుగుతున్నాయి. నాపై ఇంతవరకు ఎలాంటి చార్జిషీట్ నమోదు చేయలేదు. నా నిజాయితీని నిరూపించుకుంటున్నా.. వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నా.. కొద్దిరోజుల్లో విడుదలవుతా..' అని సౌదీ యువరాజు అల్ వాలీద్ బిన్ తలాల్ ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రూ.6,358 కోట్లను పరిహారంగా చెల్లించి తన విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తలాల్ గురించి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది రాజవంశీకులు ఇలా డబ్బులు చెల్లించి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే తలాల్ కూడా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు సిద్ధమయ్యారని చెప్పుకుంటున్నారు.

English summary
Saudi Arabian billionaire Prince Al Waleed bin Talal, detained in the kingdom's sweeping crackdown on corruption, said on Saturday that he expected to be cleared of any wrongdoing and be released from custody within days. Prince Al Waleed was speaking in an interview with Reuters at his suite in Riyadh's opulent Ritz-Carlton hotel, where he has been held for over two months along with dozens of other suspects. The prince, one of the nation's most prominent tycoons, said he was continuing to maintain his innocence of any corruption in talks with authorities. He said he expected to keep full control of his global investment firm Kingdom Holding without being required to give up assets to the government. He also said he had been well treated in detention, describing rumours of mistreatment as completely false. He gave the interview partly in order to disprove such rumours, Prince Al Waleed said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X