అలా చేస్తే ప్రపంచ యుద్దమే - భారీ మూల్యం తప్పదు : బైడెన్ సంచలనం..!!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం ప్రారంభించిన సమయం నుంచి బైడెన్ రష్యా అధ్యక్షుడి తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. రష్యా పైన అనేక ఆర్దిక ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హార్రీస్ కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు.
Recommended Video
ఇదే సమయంలో బైడెన్ రష్యా తీరు పైన మరోసారి స్పందిస్తూనే.. హెచ్చరిక లు చేసారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రసాయన ఆయుధాల వినియోగానికి రష్యా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. ఉక్రెయిన్‌లో రష్యాపై అమెరికా యుద్ధం చేయబోదని చెప్పారు.

ప్రపంచ యుద్దానికి దారి తీస్తుంది
నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. అదే సయయంలో మరో కీలక ప్రకటన చేసారు. తాము యూరప్ లోని మిత్ర దేశాల కోసం కలిసి పోరాడతామని స్పష్టం చేసారు. యునైటెడ్ స్టేట్స్ పూర్తి శక్తితో నాటో భూభాగంలోని ప్రతి ఒక్క అంగుళాన్ని రక్షించుకుంటామని వెల్లడించారు.
ఉక్రెయిన్‌లో రష్యాపై యుద్ధం చేయబోమని తేల్చి చెప్పారు. నాటో, రష్యా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధమేనని విస్పష్టంగా ప్రకటించారు. అది జరగకుండా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో రష్యా ఎప్పటికీ విజయం సాధించదని బైడెన్ అన్నారు. పోరాటం లేకుండానే ఉక్రెయిన్‌పై ఆధిపత్యం చెలాయించాలని రష్యా ఆశించింది.. కానీ విఫలమయ్యిందని పేర్కొన్నారు.

ప్రపంచం ఐక్యంగా ఉందంటూ
ఉక్రెయిన్ సమస్యపై అమెరికా, ప్రపంచం ఐక్యంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రష్యాకు వీటో అధికారాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పుతిన్ సేనలు భీకర దాడులు చేపట్టాయి. మేరియుపొల్‌లోని ప్రసూతి ఆస్పత్రిపై బాంబులు కురిపించి ముగ్గుర్ని బలి తీసుకున్న గంటల వ్యవధిలోనే... పశ్చిమాన ఉన్న లుట్స్క్ సైనిక వైమానిక స్థావరంపై విరుచుకుపడ్డాయి.

పుతిన్ మాత్రం ముందుకే
ఈ దాడుల్లో ఇద్దరు అధికారులు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికి సమీపంలోని ఇవానో ఫ్రాంకిస్క్ వైమానిక స్థావరంపైనా బాంబులు కురిపించడంతో.. భారీ విధ్వంసం జరిగింది. యుద్ధ ఆరంభంలో ఉక్రెయిన్‌లోని ప్రభావిత ప్రాంతాల నుంచి వేలమంది పౌరులు పొట్టచేతపట్టుకుని ఎల్వివ్‌కు చేరుకున్నారు. అక్కడి మానవతా శిబిరాల్లో, స్నేహితుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు రష్యా తాజాగా దాడులు చేపట్టిన వైమానిక స్థావరాలు ఈ శిబిరాలకు కేవలం 130, 150 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications