అగ్గితో ఆటలొద్దు.. మసైపోతారు..! ఇరాన్ పై నిప్పులు చెరిగిన ట్రంప్..!!
వాషింగ్టన్/హైదరాబాద్ : ఇరాన్ పై అమెరికా అద్యక్షుడు డోనాన్డ్ ట్రంప్ మరో సారి నిప్పులు చెరిగారు. అణ్వస్త్ర నిల్వలపై ఘాటుగా హెచ్చరికలు జారీ చేసారు. పలు దేశాలతో 2015లో చేసుకున్న అణు ఒప్పందంలోని అంశాలను ఇరాన్ తొలిసారి అతిక్రమిస్తూ యురేనియం నిల్వలను పెంచుకుంది. ఈ విషయంపై తాజాగా ప్రకటన చేసింది. దీన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ కూడా నిర్ధారించింది. అమెరికా తమపై విధించిన ఆంక్షలను సడలించడానికి యూరప్ సాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఇరాన్, ఈ చర్య ద్వారా దానిపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నిప్పుతో ఆడుతున్నారు' అంటూ హెచ్చరించారు. తాము చాలా కఠిన చర్యలు తీసుకునే స్థితిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా గతేడాది బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.తాము యురేనియం నిల్వలను పెంచుకున్నట్లు ఇరాన్ నుంచి ప్రకటన రాగానే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా ఈ విషయంపై స్పందించి హెచ్చరికలు చేశారు. 'ఇరాన్ అణ్వస్త్ర చర్యలు ఆ దేశానికి, ప్రపంచానికి ముప్పు. దీనిపై కొత్త, సమగ్రమైన ఒప్పందం చేసుకుని చర్చలు జరపడంతో పాటు, అంతర్జాతీయ శాంతి, భదత్రలకు పొంచి ఉన్న ముప్పును పరిష్కరించేందుకు నిబద్ధతతో ఉన్నాం' అని కూడా ప్రకటించారు.

ఇరాన్ తమ అణు కార్యక్రమ చర్యలు కొనసాగిస్తున్నంత వరకు ఆర్థికపర ఒత్తిడి, దౌత్యపరంగా ఒంటరి అవ్వడం వంటి పరిణామాలు తీవ్రతరం అవుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఆ దేశం తమ అణు లక్ష్యాలను చేరుకోవడంలో కొత్త చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్వేత సౌధంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ... 'ఇరాన్‌కు నేను ఏ సందేశమూ ఇవ్వట్లేదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు. వారు దేనితో ఆడుతున్నారో వారికి తెలుసు. వారు నిప్పుతో ఆడుతున్నారని నేను భావిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.
-
US-Iran Talks: అమెరికాతో చర్చల్లో ఇరాన్ కు తొలి విజయం..! బంపర్ ఆఫర్..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
అమెరికా అధ్యక్షుడిగా ఇంతకంటే గర్వపడలేను -
ఇజ్రాయెల్ కావాలా ? చర్చలు కావాలా ? 'ట్రంప్ కు ఇరాన్ అల్టిమేటం..! -
మన బంగారం మన దేశానికే! ఫ్రాన్స్ మాస్టర్ ప్లాన్ -
US-Iran Ceasefire: ఇరాన్ సీజ్ ఫైర్ ను చెడగొట్టిన ఇజ్రాయెల్.. ! ట్రంప్ వాట్ నెక్ట్స్ ? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నాయి.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్ -
లీటర్ పెట్రోల్ కేవలం 3 రూపాయలకే.. మీకు కావాలా ?? -
జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. -
"యుద్ద చరిత్ర తిరగరాసిన ఇరాన్"-జనసేన నేత ప్రశంసలు..! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ











Click it and Unblock the Notifications