డెలివరీ టైంలో శిశువు తలను తీసి తల్లి కడుపులోనే మొండెం వదిలిన డాక్టర్
క్వెట్టా: పాకిస్తాన్ క్వెట్టాలో ఘోరం జరిగింది. ఓ మహిళా డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్న బిడ్డ.. బయటకు రాకముందే ప్రాణాలు కోల్పోయాడు. వింటనే ఒళ్లు జలదరించే ఘటన. శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం తీసి, మొండెను తల్లి గర్భంలోనే వదిలాడు.
ఈ సంఘటన క్వెట్టాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బిడ్డ మొండాన్ని తల్లి కడుపులోనే ఉంచడమే కాకుండా.. తదుపరి శస్త్ర చికిత్స కోసం సివిక్ ఆసుపత్రికి వెళ్లాలను సదరు ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు వారికి తెలిపారు.

దీంతో ఆ తల్లిని సివిక్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జికల్ ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మొండాన్ని బయటకు తీశారు.
చనిపోయిన పాప తండ్రి అబ్దుల్ నాసిర్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంతో పసిపాప తల, మొండెం వేరు చేయడమే కాకుండా తన భార్య గర్భంలో మిగిలిన మొండాన్ని తీయడంలో ప్రయివేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో అతను క్వెట్ట్ ప్రెస్ క్లబ్‌కు వెళ్లి తన నిరసన తెలిపారు. ఆయనకు తోడుగా బంధువులు, మిత్రులు తరలి వచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తన నిర్లక్ష్యంతో నవజాత శిశువు తల, మొండాన్ని ప్రయివేటు ఆసుపత్రి డాక్టర్ వేరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం కావాలని నవజాత శిశువు తండ్రి, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications