మహిళ మెదడులో పురుగులు. స్ట్రీట్ ఫుడ్ తినడం వల్లే..! వైద్యుల మైండ్ బ్లాంక్..

ఓ మహిళ మెదడులో పురుగులను గుర్తించారు వైద్యులు. అవి మెదడులో నిర్విరామంగా తిరిగేస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె అనారోగ్యానికి కారణం ఇవేనని నిర్ధారించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనపై ప్రస్తుతం విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.

ఏం జరిగింది..?

అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల మహిళ మెదడులో అసాధారణ పురుగులను గుర్తించారు వైద్యులు. మెదడులో అవి నిర్విరామంగా కదలడాన్ని చూసి వైద్యుల మైండ్ బ్లాంక్ అయింది. తీవ్రమైన తలనొప్పి, అరికాళ్లలో మంటతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లింది. అంతకుముందే మూడు వారాలపాటు థాయ్ లాండ్, జపాన్, హవాయి దేశాల్లో టూర్ కు వెళ్లి వచ్చారు. దీంతో జెట్ ల్యాగ్ వల్ల ఇలా జరుగుతుందని భావించారు. కొన్ని మందులు వాడారు. అయినా ప్రయోజనం లేదు. కొద్దిరోజుల తర్వాత తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో మసాశుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో చేరారు.

వైద్యులు మొదట సాధారణమైన సమస్యగా పరిగణించారు. ఇబుప్రొఫెన్ ఇతర మందులు ఇచ్చారు. కానీ ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆమెకు పలు రకాల టెస్టులు, స్కానింగ్ చేయగా ఆమె మెదడులో ఏవో పొడవైన పురుగులు ఉన్నట్లు గుర్తించారు. అవి అలా మెదడు మధ్యలో తిరగడాన్ని గుర్తించి కంగుతిన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు.

మెదడులోకి పురుగులు ఎలా..?

ఆ మహిళ కొన్ని రోజుల క్రితం థాయ్ లాండ్, జపాన్, హవాయి దేశాల్లో టూర్ కు వెళ్లారు. ఆమె బ్యాంకాక్ లో ఉడకబెట్టని స్ట్రీట్ ఫుడ్ తిన్నారు. టోక్యోలోనూ ఉడకబెట్టని పచ్చిగా ఉన్న సుషీ(జపాన్ వంటకం) తిన్నారు. ఆ తర్వాత సముద్రంలో పలు సార్లు స్విమ్మింగ్ చేశారు. అయితే ఆమె తిన్న ఆహారం, ఉడికించని వంటకాల ప్రకారం.. ఆమె ఆంజియోస్ట్రాంగిలియాసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. ఈ వ్యాధిని సాధారణ భాషలో ర్యాట్ లంగ్ వార్మ్ అంటారు.

Doctors Discovered Parasitic Worms in American Woman s brain Shocking Diagnosis

ఎలుకలు విసర్జించిన మలంలో ఈ వైరస్ ఉంటుందట. కలుషిత ఆహారం తీసుకున్న నత్తలు, ఇతర జీవుల ద్వారా ఇది మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందని గుర్తించారు. ఈ వ్యాధి మెదడు, వెన్నముకపై తీవ్ర ప్రభావం చూపుతాయని గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యాధిపై తీవ్రమైన పరిశోధనలు చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+