మీరా మాకు చెప్పేది?: యూఎన్ హెచ్ఆర్సీలో పాకిస్థాన్, ఓఐసీని ఏకిపారేసిన భారత్

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్(యూఎన్ హెచ్ఆర్సీ)లో దాయాది దేశం పాకిస్థాన్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఇస్లామిక్ కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఓఐసీ)కు చురకలంటించింది. విఫల దేశం పాక్ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని ఘాటుగా స్పందించింది. ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగానే మద్దతు ఇస్తోందని, వారికి ఆర్థిక సాయం చేస్తోందని బుధవారం జరిగిన 48వ మానవ హక్కుల కౌన్సిల్‌లో భారత్ తీవ్రంగా స్పందించింది.

ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న ఉగ్రవాదులు సహా ఇతర ఉగ్రమూకలకు అండగా నిలవడం పాకిస్థాన్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా ఉందని విమర్శించింది. సిక్కులు, హిందువులు, క్రైస్తవులు సహా మైనార్టీల హక్కుల పరిరక్షణలో పాక్ విఫలమైందని జెనీవాలో భారత శాశ్వత మిషన్ మొదటి కార్యదర్శి పవన్ బాధే వివరించారు. పాక్ దేశంలో మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది మహిళలు, బాలికలు అపహరణ, బలవంతపు పెళ్లిళ్లు, మతమార్పిడులకు గురవుతున్నట్లు తెలిపారు.

 Dont need lessons from a failed state like Pakistan: India at UNHRC

విపల దేశం పాకిస్థాన్ నుంచి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్యామ్యదేశమే కాకుండా శక్తివవంతమైనది కూడా అని పవన్ బాధే స్పష్టం చేశారు. విఫల దేశం పాక్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలు తాము లేమని భారత్ వెల్లడించింది. అంతర్జాతీయ వేదికలను భారత్ కు వ్యతరేకంగా తప్పుడు హానికరమైన ప్రచారం చేయడం పాక్ కు అలవాటుగా మారిందని మండిపడింది.

ఆక్రమిత భూభాగాల విషయం, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి కౌన్సిల్ దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ చేసే ప్రయత్నాలు కౌన్సిల్ కు తెలుసని ఈ సందర్భంగా యూఎన్ హెచ్ఆర్సీలో పవన్ బాధే తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజస్వామ్య దేశమని గుర్తు చేసిన ఆయన.. దృఢమైన, శక్తివంతమైన దేశం కూడా అని గుర్తు చేశారు.

Recommended Video

    Virender Sehwag Chooses Better Captain Between Sourav Ganguly And MS Dhoni || Oneindia Telugu

    పాక్ లో మైనార్టీలపై హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న ఉగ్రవాదులు సహా ఇతర ఉగ్రమూకలకు పాక్ మద్దతిస్తోందని, అంతేగాక, వారికి శిక్షణ, ఆర్థికసాయం, ఆయుధాలు సమకూరుస్తోందన్నారు. యూఎన్ హెచ్ఆర్సీలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఓఐసీని పవన్ బాధే తప్పుబట్టారు. ఓ దేశ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే అర్హత ఇస్లామికి్
    కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు లేదని తేల్చి చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+