భారత్, పాక్ యుద్ధాన్ని ఆపేసిన ట్రంప్- సంచలన ప్రకటన..!
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత బలగాలు పాకిస్తాన్ పై భారీ ఎత్తున దాడులు కూడా చేస్తున్నాయి. ఈ దాడులు యుద్ధంగా మారబోతున్నట్లు సంకేతాాలు వెలువడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ సంచలన ప్రకటన చేశారు. ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇప్పటికే భారత్, పాకిస్తాాన్ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో వెనక్కి తగ్గాలని ఇరుదేశాల్నీ వరుసగా విజ్ఞప్తులు చేస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టులో ఇరు దేశాల మధ్య నిన్న రాత్రి నుంచీ తాము జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
సరైన సమయంలో తగిన సమయస్ఫూర్తి, కామన్ సెన్స్ వాడిన భారత్, పాకిస్తాన్ లకు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. కాల్పుల విరమణపై ఇరుదేశాలూ తగిన నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఇవాళ ఉదయం అమెరికా రక్షణ కార్యదర్శి మార్కో రుబియో భారత్, పాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఇందులో ఆయన ఇరుదేశాలకూ వెనక్కి తగ్గాలని కోరారు. దీంతో పాకిస్తాన్ కూడా వెంటనే స్వరం మాార్చింది. భారత్ యుద్దం ఆపితే తామూ వెనక్కి తగ్గుతామని పాకిస్తాన్ ఉపప్రధాని ఇనామ్ దార్ తెలిపారు. దీనికి కొనసాగింపుగా ట్రంప్ ట్వట్ వచ్చినట్లు తెలుస్తోంది.
Over the past 48 hours, @VP Vance and I have engaged with senior Indian and Pakistani officials, including Prime Ministers Narendra Modi and Shehbaz Sharif, External Affairs Minister Subrahmanyam Jaishankar, Chief of Army Staff Asim Munir, and National Security Advisors Ajit…
— Secretary Marco Rubio (@SecRubio) May 10, 2025
గత 48 గంటల్లో అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, తాను కలిసి భారత్, పాక్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోడీ ,షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ ,జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ ,అసిమ్ మాలిక్ వంటి సీనియర్ అధికారులతో చర్చలు జరిపామని అమెరికా రక్షణ కార్యదర్శి మార్కో రూబియా కూడా ట్వీట్ చేశారు.
భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు, తటస్థ ప్రదేశంలో విస్తృత శ్రేణి సమస్యలపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయని ప్రకటించడానికి తాను సంతోషిస్తున్నానని ప్రకటించారు. శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాన మంత్రులు మోడీ , షరీఫ్‌ల జ్ఞానం, వివేకం , రాజనీతిజ్ఞతను తాము అభినందిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications