ఎన్నో యుద్ధాలను ఒంటి చేత్తో పరిష్కరించా.. దాన్ని కూడా నేనే ముగిస్తా: ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని తాను పరిష్కరించగలనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈజిప్ట్‌కు బయలుదేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. "నేను చాలా యుద్ధాలను ముగించాను, ఇప్పుడు పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నా దృష్టిలో ఉంది" అని అన్నారు. తాను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడినని.. ఈ యుద్ధాన్ని కూడా త్వరలో ముగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పులు, బాంబు దాడులు సర్వసాధారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ వేదికపై చర్చనీయాంశంగా మారింది. "నేను చాలా దేశాల దేశాల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాలను ఒకే రోజులో పరిష్కరించాను" అని ట్రంప్ పేర్కొన్నారు.

Donald Trump Claims He Can End Afghanistan-Pakistan Conflict

భారత్-పాక్ వివాదాన్ని కూడా..
డొనాల్డ్ ట్రంప్ భారత ఆపరేషన్ సింధూర్‌ను కూడా ప్రస్తావించారు. భారత్-పాకిస్తాన్ వంటి సుదీర్ఘ వివాదాలను కూడా త్వరలో పరిష్కరించగలనని ఆయన అన్నారు. ట్రంప్ అనేక ఇతర అంతర్జాతీయ వివాదాలను కూడా ప్రస్తావించారు. అర్మేనియా-అజర్‌బైజాన్, కొసోవో-సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, రువాండా-కాంగో వంటి సంఘర్షణలు తన నాయకత్వంలో పరిష్కరించబడ్డాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాటలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ వివాదాలలో చాలా వరకు ఇంకా పూర్తిగా ముగియలేదు.

మారియాకు నోబెల్ శాంతి బహుమతి రావడంపై స్పందన
వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కోరినా మచాడోకు ఇటీవల లభించిన నోబెల్ శాంతి బహుమతి గురించి కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. "నేను ఇదంతా శాంతి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి చేశాను, బహుమతి కోసం కాదు" అని ఆయన అన్నారు. మారియా తనకు ఫోన్ చేసి, ఈ అవార్డును తన గౌరవార్థం అంగీకరించినట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు.

ప్రాంతీయ స్థిరత్వానికి ముందడుగు అవుతుందా?
ట్రంప్ చేసిన ఈ ప్రకటన దక్షిణాసియా రాజకీయాలపై కూడా ప్రభావం చూపవచ్చు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌కు పొరుగు దేశమైన భారత్ ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ట్రంప్ దౌత్యం విజయవంతమైతే.. అది ప్రాంతీయ స్థిరత్వానికి ఒక కీలక ముందడుగు కావచ్చు. అయితే ఈ సంక్లిష్ట వివాదాన్ని పరిష్కరించడం అంత సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు. మరి ట్రంప్ నిజంగా ఈ యుద్ధాన్ని ముగించగలరా? ఈ విషయంలో ఆయన వ్యూహం, ప్రాంతీయ దేశాల పాత్ర కీలకం అవుతాయి. ప్రస్తుతం ప్రపంచ సమాజం ట్రంప్ తదుపరి చర్య కోసం ఎదురుచూస్తోంది. ఆయన చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాకుండా, భారత్ వంటి దేశాలలో కూడా చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+