మా జోలికి వస్తే.. తాట తీస్తాం

గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంది. టెహ్రాన్ సహా ఆ దేశ ప్రధాన నగరాలపై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులను సాగిస్తోంది. మిస్సైళ్లతో విధ్వంసాన్ని సృష్టిస్తోంది.

తాజాగా- ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై మిస్సైళ్లను సంధించింది ఇజ్రాయెల్. ఆయిల్ డిపోలపైనా బాంబుల వర్షాన్ని కురిపించింది. టెహ్రాన్‌లో అణ్వాయుధ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది.

Donald Trump has threatened Iran against striking United States

ఈ దాడుల్లో ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్సివ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (SPND) భవన సముదాయం సైతం ధ్వంసమైంది. ఇరాన్ అణ్వాయుధ కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రం. దీన్ని అమద్ ప్రాజెక్ట్ గా పిలుస్తారు. తాజా దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ, SPND న్యూక్లియర్ ప్రాజెక్టు ప్రధాన కార్యాలయాలు దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ సిటీ నటాంజ్ విధ్వంసానికి గురైంది. నటాంజ్‌ సిటీలోని అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించింది ఇజ్రాయెల్. అలాగే ఫోర్డో, టెహ్రాన్ చుట్టూ ఉన్న ఇతర వ్యూహాత్మక ప్రదేశాలనూ తుత్తునీయలు చేసింది. ఈ ఆపరేషన్‌లో 200కు పైగా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను వినియోగించింది.

ఈ దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది. న్యూక్లియర్ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిరాకరించడం వల్ల తమపై ఇజ్రాయెల్ తో దాడులు సాగిస్తోందని ధ్వజమెత్తింది. అమెరికా సైతం తమ ప్రతీకార దాడులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఈ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇరాన్ తమ ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరించడం పట్ల ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమ దేశంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా సాయుధ దళాల పూర్తిస్థాయిలో ఇరాన్‌ పై యుద్ధానికి దిగుతాయని తేల్చి చెప్పారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్ పై యుద్దానికి దిగుతామని స్పష్టం చేశారు. ఇరాన్‌ పై ఇజ్రాయెల్ దాడిలో తమ ప్రమేయం లేదని వివరించారు.

అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడితే దాని పర్యవసానంగా తీవ్రంగా ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలను సులభంగా ఖరారు చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అంతే గానీ ఈ ఘర్షణల మధ్య తమను లాగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+