వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని ప్రయత్నాలూ ముగిశాయి.. ఇక ‘ఒకటే మందు’ మిగిలుంది: ఉత్తరకొరియాకు పై ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తరకొరియాను మరోసారి హెచ్చరించారు. యుద్ధం తప్పదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అన్ని ప్రయత్నాలూ ముగిశాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తరకొరియాను మరోసారి హెచ్చరించారు. యుద్ధం తప్పదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అన్ని ప్రయత్నాలూ ముగిశాయి. ఉత్తరకొరియాకు ఇక ఒకటే మందు మిగిలుంది అని వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియాతో చర్చలకు ట్రంప్‌ విముఖంగా ఉన్న విషయం తెలిసిందే. గతవారం ఆయన అమెరికా సెక్రటరీ రెక్స్‌ టిల్లర్సన్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్‌ కూడా చేశారు. 'మనం ఏం చేయాలో అదే చేద్దాం.. శక్తిని దాచుకో రెక్స్‌..' అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

Donald Trump issues another threat to North Korea as tensions grow

తాజాగా ట్విట్టర్ లో ట్రంప్ మరోసారి ఉత్తర కొరియపై తన వాగ్బాణాలను సంధించారు. ఎంతో మంది అమెరికా అధ్యక్షులు, వారి కార్యదర్శులు పాతికేళ్లుగా ఉత్తరకొరియాతో ఎడతెగని చర్చలు జరిపారు. ఆ దేశానికి భారీగా సొమ్ములు ముట్టజెప్పారని పేర్కొన్నారు.

కానీ ఉత్తరకొరియా విషయంలో అవేవీ పనిచేయలేదని, చేసుకున్న ఒప్పందాలను కూడా ఆ దేశం ఉల్లఘించిందని, అమెరికా మధ్యవర్తులు ఫూల్స్‌ అయ్యారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, ''ఇప్పుడు కలంలో సిరా అయిపోయింది.. క్షమించండి, ఇక ఉత్తరకొరియాకు ఒకే ఒక్క మందు బాగా పనిచేస్తుంది..'' అని ట్రంప్ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

సమర్థించుకున్న కిమ్...

ట్రంప్ వ్యాఖ్యలను, ట్వీట్లను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాగ్ ఉన్ కొట్టిపారేశారు. తమ దేశం అణుపరీక్షలను జరపడాన్ని ఆయన తాజాగా సమర్థించుకున్నారు. పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఆ ప్రయోగాలు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు.

English summary
US President Donald Trump said that diplomatic efforts with North Korea have consistently failed, adding that “only one thing will work.” Trump has engaged in an escalating war of words with North Korean strongman Kim Jong-un, trading insults amid rising tensions between the two nuclear-armed rivals. “Presidents and their administrations have been talking to North Korea for 25 years, agreements made and massive amounts of money paid,” Trump tweeted. It “hasn’t worked, agreements violated before the ink was dry, makings fools of U.S. negotiators. Sorry, but only one thing will work!” The US has not ruled out the use of force to compel Pyongyang to halt missile and nuclear tests, and Trump has threatened to “totally destroy” the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X