ట్రంప్ నోటీ దూల‌..! మ‌రో సారి భార‌త్ పై అవాకులు చ‌వాకులు..!!

వాషింగ్టన్/ హైద‌రాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే విస్కీపై అమెరికా ప్రభుత్వం దిగుమతి సుంకాన్నే వసూలు చేయడం లేదని.. అమెరికా నుంచి భారత్‌కు ఎగమతి అయ్యే విస్కీపై మాత్రం భారత ప్రభుత్వం 150 శాతం సుంకాన్ని విధిస్తోందంటూ విమర్శించారు.

గతంలో ఆయన భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని సంచలన వ్యాఖ్యలు చేయగా..ఆ సమయంలో వరల్డ్ బ్యాంక్ అధికారులు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. యూఎస్ ట్రేడ్ డెఫిసిట్ ప్రాబ్లమ్(యూఎస్-ఆర్టీఏ) ద్వారా అమెరికా దేశం నుంచి ప్రయోజనాలను పొందుతున్న వారికి అడ్డుకట్ట వేసి, 800 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు సమస్య తీరుతుందని భావిస్తున్నానని ట్రంప్ అన్నారు.

Donald Trump loose talk..! again made allegations on India..!!

నిజానికి ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం కూడా ఇలానే వసూలు చేస్తున్నాయని వరల్డ్ టారిఫ్ ప్రొఫైల్స్(డబ్ల్యూటీఓ) 2018 లెక్కలు చెబుతున్నాయి. డబ్ల్యూటీఓ గణాంకాల ప్రకారం, జపాన్ 736 శాతం, కొరియా 807 శాతం, అమెరికా 350 శాతం, ఆస్ట్రేలియా 163 శాతం, ఇండియా 150 శాతం దిగుమతి సుంకాలను వసూలు చేస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు కేవలం ఒక వస్తువు గురించే ప్రస్తావిస్తున్నారని..అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఏ వస్తువుపైనా సుంకాన్ని వసూలు చేయడం లేదా అంటూ భారతీయులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల దేశాల్లోని రైతులను, కార్మికులను ఆదుకోడానికే అన్ని దేశాలు దిగుమతులపై ఎక్కువ శాతం సుంకాన్ని వసూలు చేస్తున్న విష‌యం తెలిసిందే..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+