ట్రంప్ మాస్టర్ ప్లాన్: ముగియనున్న రెండేళ్ల యుద్ధం?

Donald Trump: గాజాలో సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ సమగ్ర శాంతి ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు కూడా అంగీకరించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ శాంతి ప్రణాళిక ద్వారా గాజాలో యుద్ధాన్ని ముగించి పునర్మిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శాంతి ప్రణాళికకు 8 దేశాల మద్దతు
డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఈ శాంతి ప్రణాళికకు మొత్తం 8 అరబ్, ముస్లిం దేశాలు తమ సమ్మతిని తెలిపాయి. ఈ దేశాల్లో ఖతార్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ఉన్నాయి. ఈ దేశాల విదేశాంగ మంత్రులు ట్రంప్ నాయకత్వాన్ని, శాంతి ప్రయత్నాలను స్వాగతించారు. ఈ ప్రణాళిక గాజాలో తక్షణ కాల్పుల విరమణకు, పునర్నిర్మాణానికి , పాలస్తీనా పౌరుల స్థానభ్రంశాన్ని అరికట్టడానికి, శాశ్వత శాంతికి దోహదపడుతుందని వారు ప్రశంసించారు.

Donald Trump Master Plan Ceasefire in Gaza Key Details of the 21-Point Peace Proposal

హమాస్ అంగీకరిస్తే ఏం జరుగుతుంది?
హమాస్ కనుక శాంతి ప్రతిపాదనను అంగీకరిస్తే, యుద్ధం తక్షణమే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి వెనక్కి తగ్గుతుందని.. అన్ని సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయన్నారు. అరబ్, ముస్లిం దేశాలు కూడా ఈ ప్రక్రియలో సహకరిస్తాయి.

హమాస్ తిరస్కరిస్తే ఏం జరుగుతుంది?
ఒకవేళ హమాస్ ఈ శాంతి ప్రణాళికను తిరస్కరిస్తే, హమాస్‌ను పూర్తిగా నాశనం చేయడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తుంది. ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి అమెరికా సైన్యం కూడా ఈ పనిని పూర్తి చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ శాంతి ప్రణాళికలోని ముఖ్యాంశాలు
ట్రంప్ ప్రకటించిన 21 సూత్రాల శాంతి ప్రణాళికకు అంగీకరించేందుకు హమాస్‌కు 72 గంటల సమయం ఉంది. ఈ ప్రణాళికలోని ముఖ్యాంశాలు:

ఇరు పక్షాలు సంతకం చేయగానే తక్షణమే సీజ్‌ఫైర్ ప్రకటిస్తారు. గాజా తాత్కాలిక పాలనా బాధ్యతలను టెక్నోక్రాటిక్ పాలస్తీనా కమిటీకి అప్పగిస్తారు. దీనిని అధ్యక్షుడు ట్రంప్, మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని అంతర్జాతీయ బోర్డ్ ఆఫ్ పీస్ పర్యవేక్షిస్తుంది.గాజాను పునరుద్ధరించడానికి, పాలస్తీనా, ప్రపంచ నిపుణులతో కూడిన కొత్త గవర్నింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. పాలస్తీనియన్ పౌరులను గాజాను విడిచి వెళ్లవలసిందిగా నిర్బంధించడం జరగదు. ఇజ్రాయెల్ 72 గంటల్లోగా బంధీలుగా ఉన్న అందరినీ (బతికున్న లేదా మరణించిన) అప్పగిస్తుంది.ఇజ్రాయెల్ 250 మంది జీవిత ఖైదీలను, 1700 మంది గాజా పౌరులను విడుదల చేస్తుంది.

ఆయుధాలు విడిచిపెట్టి, శాంతికి హామీ ఇచ్చే హమాస్ సభ్యులకు క్షమాభిక్ష లభిస్తుంది, వారు సురక్షితంగా బయటకు వెళ్లడానికి అవకాశం కల్పిస్తారు. గాజాలో మానవీయ సాయం, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, రహదారుల పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయంతో సహాయ సామగ్రిని అందిస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఒక ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి, అందుకు ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+