వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లింటన్ మాపై అత్యాచారం చేశాడు: రెండో డిబేట్‌లోనూ హిల్లరీదే పైచేయి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తమపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ నలుగురు మహిళలు ఆరోపించారు. అమెరికా అధ్యక్ష బరిలో భాగంగా భారత కాలమానం ప్రకారం సోమవారం రెండో డిబేట్‌కు ముందు ఈ నలుగురు మహిళలతో కలిసి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు.

2nd డిబేట్‌లో పేలిన తూటాలు: మారిన మనిషిని, అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడు
అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు క్లింటన్ తమపై అత్యాచారానికి పాల్పడ్డారని ఈ ముగ్గురు మహిళలు ఆరోపించారు. తాను బాలికగా ఉన్నప్పుడు అతను తనపై లైంగిక దాడి జరిపాడని మరో మహిళ ఆరోపించింది. మహిళలపై తాను చేసిన అశ్లీల వ్యాఖ్యల ఆడియో టేపులు బయటపడడంతో ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో హిల్లరీని ఎదుర్కొనేందుకు బాధిత మహిళలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ నలుగురు మహిళలు చాలా ధైర్యవంతులని, వారికి అండగా నిలబడటం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సోమవారం ట్రంప్, హిల్లరీల మధ్య జరిగిన రెండో బిగ్ డిబేట్‌లో మాటల యుద్ధం కొనసాగింది.

Donald Trump Meets With Bill Clinton Accusers Before Debate

రెండో డిబేట్‌లోనూ హిల్లరీదే పైచేయి

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు నోటి దురుసుతనంతో అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ దూరమవుతున్నారు. సోమవారం సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో జరిగిన రెండో బిగ్ డిబేట్‌లో కూడా హిల్లరీపై ఏ మాత్రం అధిక్యాన్ని చూపించలేకపోయారు.

రెండో డిబేట్‌లో గెలిస్తే తామేం చేస్తామనే విషయాన్ని పక్కనబెట్టిన ఇరువురు నేతలూ, వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. ఇక ఈ డిబేట్ అనంతరం ఓ టీవీ చానల్ పోల్ నిర్వహించగా, అత్యధికులు హిల్లరీకే మద్దతు ప్రకటించారు.

రెండో డిబేట్‌లో హిల్లరీకి 5 7శాతం మంది మద్దతు పలుకగా, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 34శాతం మంది అండగా నిలిచారు. 5 పాయింట్లకు గాను హిల్లరీకి సరాసరిన 3.56, ట్రంప్ కు 2.59 పాయింట్లు లభించాయి. ఇదిలా ఉంటే మొదటి డిబేట్‌లో కూడా ట్రంప్‌పై హిల్లరీ స్పష్టమైన ఆధిక్యతను సాధించిన సంగతి తెలిసిందే.

మొదటి డిబేట్‌లో హిల్లరీకి 62 శాతం మంది మద్దతు పలుకగా, ట్రంప్‌కు కేవలం 27 శాతం మందే మాత్రమే మద్దతిచ్చారు. తొలి డిబేట్‌తో పోలిస్తే రెండో డిబేట్‌లో హిల్లరీ ఆధిక్యం కొంత తగ్గినప్పటికీ, ట్రంప్‌పై స్పష్టమైన ఆధిక్యంతో ఆమె ముందుకు దూసుకుపోతున్నారు.

English summary
Less than two hours before his appearance at the second presidential debate, GOP presidential nominee Donald Trump held a brief public event with three women who have accused former President Bill Clinton of sexual impropriety and one woman whose accused rapist was represented by then attorney Hillary Clinton during his criminal trial in 1975.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X