వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా ప్రసంగం బోర్ కొట్టించింది: డొనాల్డ్ ట్రంప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అద్యక్షులు బరాక్ ఒబామా ప్రసంగం తనకు బోర్ కొట్టించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఒబామా బుధవారం నాడు చివరి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగం పైన ట్రంప్ స్పందించారు.

ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించారు. ది స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తనకు కొట్టిందని ఒబామా పైన విమర్శలు చేశారు. ఆయన చేసిన ప్రసంగం బాగా లేదని, ఉపయోగకరంగా కూడా లేదని పేర్కొన్నారు.

ఇలాంటి ప్రసంగం తాను చాలాసార్లు విన్నానని చెప్పారు. అన్ని దేశాలలో కెల్లా బలమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అమెరికా అని బరాక్ ఒబామా పేర్కొన్నారు. అంతేకాకుండా ముస్లింలను అమెరికాలోకి రానివ్వద్దంటూ గతంలో డొనాల్డ్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ ప్రసంగంలో ఒబామా స్పందించారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పైవిధంగా వ్యాఖ్యానించారు.

Donald Trump: President Obama’s State of the Union Was 'Really Boring'

అంతకుముందు ఒబామా మాట్లాడుతూ... ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్‌తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో అస్థిరత అనేది భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందన్నారు. తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుండటంతో దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన తుది ప్రసంగం చేశారు.

ఆసియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, సెంట్రల్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఐసిస్ కార్యకలాపాలు లేనప్పటి నుంచి కూడా అస్థిరత కొనసాగుతూనే ఉందన్నారు. ఉగ్రవాదానికి కొత్తగా ఆకర్షితులవుతున్న వారికి ఈ దేశాల్లో కొన్ని సురక్షిత ప్రాంతాలుగా మారాయని అభిప్రాయపడ్డారు.

English summary
Republican frontrunner Donald Trump summed up his response to President Obama's final State of the Union address with a 140 character tweet -- calling the president's speech “really boring.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X