ఆసుపత్రిలో ట్రంప్ కోడలు: 'ఆంత్రాక్స్' కలకలం.. ఆ కవర్ ఓపెన్ చేయగానే?

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలు వనెసా ట్రంప్ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నాడు వనెసాకు అందిన ఒక కవర్‌(మెయిల్) తెరిచి చూడగా.. అందులో ఉన్న తెల్లటి పౌడర్ ఘాటుకు ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.

అస్వస్థతకు గురైన వెంటనే ఆమెను న్యూయార్క్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ పౌడర్‌ను పరిశీలించిన అధికారులు.. అదేమి ప్రమాదకరమైనది కాదని నిర్దారించారు.

వనెసా తల్లి కూడా..

వనెసా తల్లి కూడా..

వనెసా ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్డ్ జూనియర్ భార్య. ఆ పౌడర్ వల్ల వనెసాకు లోపలేదో తిప్పినట్టుగా.. వికారం కలుగుతున్న ఫీలింగ్ కలగడంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.


ఆమెతో పాటు మరో ఇద్దరిని కూడా ఆసుపత్రిలో చేర్చినట్టు చెబుతున్నారు. వనెసా ట్రంప్ తో పాటు అస్వస్థతకు గురైనవారిలో ఆమె తల్లి కూడా ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు.

కవర్‌పై అతని పేరు..

కవర్‌పై అతని పేరు..


ఘటనపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు.. ఆ కవర్‌పై డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అని రాసి ఉందని, అది అతని కోసమే వచ్చి ఉంటుందని తెలిపారు. 2016లో ఇలాంటి పౌడరే డొనాల్డ్ జూనియర్ సోదరుడి ఇంటికి కూడా వచ్చిందని చెబుతున్నారు.

ఆంథ్రాక్స్ కలకలం..

ఆంథ్రాక్స్ కలకలం..

కాగా, ఇలా తెల్ల పౌడర్ తో వచ్చిన కవర్స్.. గతంలోనూ కలకలం సృష్టించాయి. 2001లో ఇలాంటి కొరియర్స్ ద్వారా ఆంత్రాక్స్ వ్యాధిని అంటించేందుకు కుట్రలు జరిగాయని, అప్పుడు కూడా ఇలాంటి తెల్లటి పౌడర్ నే కవర్ ద్వారా పంపించారని అక్కడి అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీని కారణంగా అప్పట్లో ఐదుగురు యూఎస్ లా మేకర్స్ కూడా చనిపోయారని పేర్కొన్నారు.

డొనాల్డ్ జూనియర్ ట్వీట్:

డొనాల్డ్ జూనియర్ ట్వీట్:

డొనాల్డ్ జూనియర్ పేరు మీద వచ్చిన ఆ కవర్‌పై బోస్టన్ పోస్ట్ మార్క్ ఉందని ఏబీసీ న్యూస్ మరియు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించాయి. సంఘటన అనంతరం డొనాల్డ్ జూనియర్ ట్వీట్ చేయడం గమనార్హం. 'ఈ ఉదయం ఎదురైన భయానక, సంక్లిష్ట పరిస్థితుల నుంచి నా భార్య, పిల్లలు సురక్షితంగా బయటపడినందుకు థాంక్ గాడ్..' అంటూ ట్వీట్ చేశాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump's daughter-in-law Vanessa Trump was taken to a New York hospital on Monday after she opened a piece of mail containing an unidentified white powder that was later determined to be non-hazardous, officials said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి