వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్ట్: ఆ జాబితాలో అమెరికా ర్యాంకు ఢమాల్..

ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలకు ప్రజల్లో ఏర్పడిన ప్రతికూలతల వల్లే అమెరికా ర్యాంకు పడిపోయి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్:ప్రపంచ అత్యుత్తమ దేశాల జాబితాలో గతేడాది 4వ స్థానాన్ని దక్కించుకున్న అమెరికా.. ఈ ఏడాది ఏడో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్ట‌న్ స్కూల్ అండ్ గ్లోబ‌ల్ గ్రాండ్ క‌న్స‌ల్టెంట్స్‌కు చెందిన‌ యూఎస్ న్యూస్ అండ్ వ‌ర‌ల్డ్ ప్రపంచ అత్యుత్తమ దేశాల జాబితా-2017ను విడుదల చేసింది.

జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకోగా.. రెండు, మూడు స్థానాల్లో కెన‌డా, బ్రిట‌న్ దేశాలు ఉన్నాయి. గతేడాది నంబర్.1 స్థానాన్ని దక్కించుకున్న జర్మనీ.. ఈ ఏడాది నాలుగో స్థానానికి పడిపోయింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలు దేశాల‌కు చెందిన 21 వేల మంది వ్యాపార‌వేత్తలు, ప్ర‌ముఖులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. అమెరికా ర్యాంకు ఇంతగా పడిపోవడానికి కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపేనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

Donald Trump’s new travel ban is much narrower

ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలకు ప్రజల్లో ఏర్పడిన ప్రతికూలతల వల్లే అమెరికా ర్యాంకు పడిపోయి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఊతమిచ్చేలా యూఎస్ న్యూస్ ఎడిట‌ర్ బ్రియ‌న్ కెల్లీ సైతం 'రాజ‌కీయ మార్పులు ఒక దేశంపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయో తెలిసింద‌ని' వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అమెరికా నాయకత్వం మారడంతో ఆ దేశంపై గౌరవం తగ్గిపోయిందని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 75శాతం మంది అభిప్రాయపడినట్లు సమాచారం.

English summary
It may be too early to expect President Donald Trump to fulfill his campaign promise of “making America great again,” but it's clear that he has his work cut out for him. A new ranking of the best countries shows America has fallen three spots to seventh place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X