Donald Trump: భారతీయులకు షాక్.. వారిని తిప్పి పంపుతామన్న డొనాల్డ్ ట్రంప్..!

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే దేశంలో అక్రమ వలసదారులను పంపించేస్తామని చెప్పారు. ఇటీవల ఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాలో నివసిస్తున్న పత్రాలు లేని వలసదారులందరినీ వెళ్లగొడతామని స్పష్టం చేశాడు. చాలా మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని గుర్తు చేశారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను బహిష్కరించడం ద్వారా ప్రభుత్వం ప్రణాళికను ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు.

కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్థులు నేరుగా అమెరికాకు వస్తున్నారని చెప్పారు. అలాంటి 13,099 మంది నేరస్థులు అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వకూడదని స్పష్టం చేశారు. వారిని తక్షణం వెళ్లగొట్టాలని తేల్చిచెప్పారు. ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారుల సమస్యను హైలైట్ చేశారు. అధ్యక్ష ఎన్నికలలో పత్రాలు లేని వ్యక్తులు ఓటు హక్కు కల్పించారని ఆరోపించారు.

Donald Trump says he will deport illegal immigrants in the US

రాజ్యాంగ సవరణపై కూడా ఆయన మాట్లాడారు. అమెరికాలో ఉండాలనుకునేవారు తమ దేశాన్ని ప్రేమించాలని స్పష్టం చేశారు. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలని అన్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానం (డ్రీమర్స్‌)లో చాలామంది ఇక్కడే పుట్టి పెరిగారని గుర్తు చేశారు. వారిలో చాలామంది గొప్ప ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారని.. వారి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. 2022 యూఎస్ జనాభా లెక్కల ప్రకారం దాదాపు 4.8 మిలియన్ల భారతీయ-అమెరికన్లు అమెరికాలో నివసిస్తున్నారు. వీరిలో 34 శాతం లేదా 1.6 మిలియన్లు దేశంలో జన్మించారు.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ట్రంప పౌరసత్వాన్ని రద్దు చేస్తే, అది నేరుగా ఈ 1.6 మిలియన్ల భారతీయ సంతతి ప్రజలపై ప్రభావం చూపుతుంది.తల్లిదండ్రులు US పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు కాని వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్ పొందడానికి ఇప్పటికే సంవత్సరాలుహా నిరీక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+