ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తరపున మాట్లాడుతున్నారని పాక్ విదేశాంగ మంత్రి ఖాజ్వ ఆసిఫ్ ఆరోపించారు.అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని పాక్ ప్రకటించింది.
గురవారం నాడు ఆయన పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకొంది.ఈ తరుణంలో ఆసిప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వైఫల్యాలను పాకిస్తాన్‌పై రుద్దేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.భారత్ తరపున ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని ఈ సమావేశంో ఆసిఫ్ వ్యాఖ్యానించారని సమాచారం.

అమెరికా నాయకుల ప్రసంగాలు వాస్తవాలకు విరుద్దంగా ఉన్నాయని ఆసిఫ్ ఆరోపించారు.అయితే పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీకి చైర్మెన్ గా వ్యవహరిస్తున్న జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాధిఖ్ అమెరికా ఆరోపణలను తోసిపుచ్చారు. సమతుల్యంగా ప్రకటనలు ఉండాలని అమెరికాకు ఆయన హితవు పలికారు.
భద్రతా సంస్థలు నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా ఆయన మీడియాకు చెప్పారు. అయితే ఈసమావేశంలో రక్షణ శాఖ మంత్రి దస్తగిర్ కూడ పాల్గొన్నారు. పాక్ సందర్శనకు వచ్చిన సమయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి టెల్లర్‌సన్ సహ ఇతరులెవరూ కూడ తమను బెదిరింపు ధోరణితో వ్యవహరించలేదని ఆయన గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం అమెరికా తీరు తమను బెదిరించే రీతిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితులపై పూర్తిస్థాయిలో సమీక్షను నిర్వహించినట్టు ఆయన చెప్పారు. పాకిస్థాన్ రక్షణ విషయంలో ఎలాంటి సందేహలు లేవని ఆయన తేల్చి చెప్పారు.పాకిస్థాన్ ను హని కల్గించే పరిస్థితిని అమెరికా తీసుకొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అన్నింటికి తాము సిద్దంగానే ఉన్నామని ఆయన చెప్పారు.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!