• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిజినెస్ ఫ్రెండ్లీ: బ్రిటన్‌కు ట్రంప్ క్షమాపణ, మీడియాపై మరోసారి

|

దావోస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తమ దేశానికి పెట్టుబడులను ఆహ్వానిస్తూనే.. మీడియాపై తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. దావోస్‌లో శుక్రవారం ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతునిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే అది నిష్పక్షపాతంగా, పరస్పరం ప్రయోజనకారిగా ఉండాలని పేర్కొన్నారు.
అమెరికన్ ఫస్ట్ పాలసీ అంటే అమెరికన్లు మాత్రమే అని కాదని వివరణ ఇచ్చారు.
ఇతర దేశాల అధినేతలు.. ట్రంప్ రక్షణాత్మక విధానాలపై దాడి చేయడంతో ఆయన వెనుకకు తగ్గినట్లు తెలుస్తోంది.

Donald Trump woos business but attacks media at Davos

కాగా, అమెరికాలో వ్యాపారానికి ద్వారాలు తెరిచే ఉన్నాయని ట్రంప్ న్నారు. అయితే అది పోటీ తత్వం కలిగి ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా తిరిగి మారనివ్వబోమని స్పష్టం చేశారు. 'అమెరికా, తన నిర్ణయాలపై ప్రస్తావించిన ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ పలుసార్లు తన రికార్డులను తిరుగరాసింది. ఏడు లక్షల కోట్ల డాలర్లకుపైగా నూతన ఆదాయం సృష్టించింది' అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాలో పెట్టుబడులు, ఉద్యోగాలు, వ్యాపారాలకు ప్రస్తుతం సరైన సమయం అని చెప్పారు. నూతన పన్ను విధానంతోపాటు తన ప్రభుత్వ విధానాలను సవివరంగా వివరించిన ట్రంప్.. దేవుడు మీ అందరినీ దీవించుగాక అని ప్రసంగాన్ని ముగించారు.

అంతేగాక, తాను ఒక వ్యాపార వేత్తగా మీడియా ప్రేమికుడినని ట్రంప్ చెప్పారు. కానీ తాను రాజకీయవేత్తగా మారగానే తనకు వ్యతిరేకంగా మీడియా బూటకపు వార్తలు వెలువరించిందన్నారు. కాగా, ఆఫ్రికన్లు మురికివారని ట్రంప్.. వ్యాఖ్యానించినందుకు ఆఫ్రికా దేశాల అధినేతలు, ప్రతినిధులు ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారు. కాగా, కార్పొరేట్ సీఈవోలకు ఇచ్చిన ట్రంప్ విందుకు భారత సంతతికి చెందిన ముగ్గురు సీఈవోలతోపాటు 16 మంది ఈయూ సంతతి సీఈవోలు హాజరయ్యారు. నొవార్టీస్ సీఈవో వ్యాస్ నరసింహన్, నోకియా సీఈవో రాజీవ్ సూరి, డెల్లాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ విందులో పాల్గొన్నారు. కాగా, బిల్ క్లింటన్ తర్వాత డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరైన రెండో అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం.

బ్రిటన్‌కు క్షమాపణ

డొనాల్డ్ ట్రంప్ తాను చేసిన పనికి క్షమాపణ చెప్పారు. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ట్రంప్.. శుక్రవారం బ్రిటన్ పియర్స్ మోర్గాన్ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జాత్యాహంకార గ్రూప్ వీడియోను నవంబర్‌లో ట్రంప్ రీట్వీట్ చేసిన అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ 'మీరు చెప్పినట్లు ఇస్లామిక్ వ్యతిరేక వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారు జాత్యాహంకార వ్యక్తులైతే.. దాన్ని రీ ట్వీట్ చేసినందుకు నేను తప్పనిసరిగా క్షమాపణ చెబుతున్నా' అని ట్రంప్ అన్నారు.

English summary
Donald Trump has taken his battle with the media on to the global stage by using a speech in Davos declaring the US open for business to accuse his press and TV critics of being mean, vicious and purveyors of fake news.
Read in English: Trump booed at Davos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X