భారత్-పాక్ మధ్యవర్తిత్వంపై ట్రంప్ యూటర్న్ ? సంచలన వ్యాఖ్యలు..!

కశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఉధృతంగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎంటరై భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం కుదిర్చానని, దీని ప్రకారం ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇదే విషయం చెబుతూ వచ్చారు. దీంతో భారత ప్రభుత్వం ఇరుకునపడింది. పాకిస్తాన్ తో సమస్యలో మూడో దశం మధ్యవర్తిత్వం అవసరం ఏమొచ్చిందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇవాళ ఉన్నట్లుండి తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు.

ఖతార్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై మరోసారి స్పందించారు. ఈ రెండు దేశాల మధ్య తన మధ్యవర్తిత్వంపై జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసినట్లు చెప్పబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే భారత్-పాకిస్తాన్ మధ్య వివాద పరిష్కారానికి సాయం మాత్రం చేశానని ట్రంప్ వెల్లడించారు.

Donald trump s U turn on mediation between india and Pakistan says not did it just helped

భారత్-పాకిస్తాన్ మధ్య వివాదం పరిష్కారం అయిందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తాను ఇరుదేశాలతో వాణిజ్యం గురించి మాట్లాడానని తెలిపారు.. యుద్ధానికి బదులుగా వాణిజ్యం చేద్దామని ప్రతిపాదించానన్నారరు. దీంతో పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉందని, భారతదేశం కూడా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వారు అదే బాటలో ఉన్నారని తాను భావిస్తున్నానని ట్రంప్ తెలిపారు. తద్వారా ఇరు దేశాలకు వాణిజ్యంపై ఆఫర్ ఇచ్చి యుద్ధం విరమించినట్లు ట్రంప్ మరోసారి చెప్పకనే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+