వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిరోజూ బీర్ తాగితే బోలెడు లాభాలట.. పోర్చుగీస్ యూనివర్సిటీ అధ్యయనం; కానీ తెలుసుకోవాల్సిన విషయాలివే!!

|
Google Oneindia TeluguNews

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. ఎక్కువగా మద్యం సేవించే వారి ఆరోగ్యం పాడవుతుందని కూడా చెప్తుంటారు. కానీ ఒక లిమిట్ లో ప్రతి రోజు బీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనం ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకు రావడంతో ఇంకేం మందుబాబులకు పండుగ చేసుకున్నట్టుగా ఉంది. అయితే వాళ్లంతా ముందు దీనికి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది .

ప్రతిరోజు బీర్ లిమిట్ లో తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు

ప్రతిరోజు బీర్ లిమిట్ లో తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు

ప్రతి రోజు బీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని ఆసక్తికరమైన విషయాలను పోర్చుగీసు యూనివర్సిటీ ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రతిరోజూ బీరు తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని పోర్చుగల్‌లోని నోవా యూనివర్శిటీ, లిస్బన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు. రోజూ రాత్రి భోజనంతో పాటు బీర్ తాగడం వల్ల పురుషుల పొట్టలో మంచి బ్యాక్టీరియా స్థాయి పెరుగుతుందని వారు చెబుతున్నారు. ఈ ప్రయోజనం ఆల్కహాలిక్ మరియు నాన్-ఆల్కహాలిక్ బీర్ రెండింటి నుండి వస్తుందని వారు పేర్కొన్నారు.

19మంది 35ఏళ్ళ పురుషులపై 4 వారాల పాటు సాగిన పరిశోధన

19మంది 35ఏళ్ళ పురుషులపై 4 వారాల పాటు సాగిన పరిశోధన

మొత్తం 19 మంది 35 సంవత్సరాల వయసున్న పురుషులపై ఈ అధ్యయనాన్ని కొనసాగించారు. వారందరూ 4 వారాల పాటు ప్రతిరోజూ రాత్రి భోజనంతో పాటు 325 మిల్లీలీటర్ల బీర్ తాగాలని కోరారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో కొందరికి ఆల్కహాల్ మరియు మరికొందరికి ఆల్కహాల్ లేని బీర్ ఇవ్వబడింది. ఆల్కహాలిక్ బీర్ లో ఆల్కహాల్ కంటెంట్ 5.2%గా ఉంది. ఇటువంటి బీర్ కొందరికి ఇవ్వబడింది. మరి కొందరికి నాన్ ఆల్కహాలిక్ బీర్ ఇవ్వబడింది.

బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా

బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా


4 వారాల పాటు చేసిన అధ్యయనం తరువాత, ఈ పురుషుల మలం మరియు రక్త నమూనాలను తీసుకున్నారు. ఈ నమూనాల ఆధారంగా బీర్ తాగడం వల్ల పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఈ పరిశోధన ఫలితాలు బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఈ బ్యాక్టీరియా మరింత వైవిధ్యమైనది. ఇది మొత్తం జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడించారు.

బీర్ తాగటం వల్ల బరువు పెరగరని పేర్కొన్న అధ్యయనం

బీర్ తాగటం వల్ల బరువు పెరగరని పేర్కొన్న అధ్యయనం

బీర్‌లో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు మరియు కుళ్ళిన ప్రక్రియ తర్వాత ఏర్పడిన సూక్ష్మజీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన ద్వారా గుర్తించారు. ఇవి పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయని నిర్ధారించారు. శరీరంలో అనేక రకాల మంచి బ్యాక్టీరియా ఉండటం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు రోజూ బీర్ తాగడం వల్ల బరువు లేదా బాడీ మాస్ ఇండెక్స్ పెరగదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే రక్తం, గుండె మరియు జీవక్రియలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉండవని పేర్కొన్నారు.

ఎంత పడితే అంత తాగితే అనారోగ్యం పక్కా .. మందుబాబులు తస్మాత్ జాగ్రత్త

ఎంత పడితే అంత తాగితే అనారోగ్యం పక్కా .. మందుబాబులు తస్మాత్ జాగ్రత్త

ఇక బీర్ తాగటం మంచిదే అని శాస్త్రవేత్తలు చెప్పారని ఎంత పడితే అంత తాగేస్తే కచ్చితంగా అనారోగ్యం పాలవుతారు. లిమిట్ లో మోతాదు మించకుండా బీర్ ను కూడా ఒక టానిక్ లా పద్దతిగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది తప్ప,. ఇష్టారాజ్యంగా కడుపు నిండా పోస్తే అది మరింత ప్రమాదకారిగా మారుతుంది. అందుకే మందుబాబులు తస్మాత్ జాగ్రత్త!!

English summary
A Portuguese University Study Shows health Benefits Of Drinking Beer Every Day, but suggested to drink in limit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X