వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కష్ట కాలంలో కరుడుగట్టిన డ్రగ్‌ డీలర్స్ ఆపన్న హస్తం... సహాయం చేస్తూ ఇలా..!

|
Google Oneindia TeluguNews

వారు కరుడు గట్టిన డ్రగ్ డీలర్స్.. మానవత్వం అంటే తెలియని వారు. కేవలం డబ్బుపైనే వారి దృష్టంతా. తేడా వచ్చిందో శాల్తీలు లేచిపోతాయి. చూసేందుకు అత్యంత భయంకరంగా ఉంటారు వారి దందా అంతా చీకటి రాజ్యంలోనే జరుగుతుంది. వారి భారీ డీల్స్ అన్నీ రాత్రివేళల్లోనే.అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనావైరస్ కబళిస్తున్న నేపథ్యంలో వారిలోను మానవత్వం దాగి ఉందని ప్రపంచానికి చాటుతున్నారు. ఈ కష్ట సమయంలో సాటి మనుషులకు సహాయం చేస్తూ ఆదుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మెక్సికోలో ఒకటి వెలుగు చూసింది.

ఆదుకుంటున్న ఎల్‌చాపో కుమార్తె

ఆదుకుంటున్న ఎల్‌చాపో కుమార్తె


మెక్సికోలో డ్రగ్స్ లీగల్. అక్కడ చాలా మంది డ్రగ్ డీలర్స్ దర్శనమిస్తారు. ఇక కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న నేపథ్యంలో డ్రగ్ డీలర్స్ కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మెక్సికో డ్రగ్స్‌ కింగ్ జాక్విన్ ఎల్ చాపో గుజ్‌మ్యాన్ కుమార్తె అలెజాండ్రినా గుజ్‌మ్యాన్ కోవిడ్-19 తో సర్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ కష్ట సమయంలో వారికి నిత్యావసర వస్తువులతో పాటు ఆహారం, మాస్కులు, సబ్బులు, ఇతర వస్తువులను పంచిపెట్టింది. ఇప్పటికే తన తండ్రి జాక్విన్ ఎల్‌చాపో గుజ్‌మ్యాన్‌ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

నిత్యావసర వస్తువులను అందజేసిన అలెజాండ్రినా

ఇక తాజాగా తన తండ్రి ఫోటో ఉన్న బాక్స్‌లో నిత్యావసర వస్తువులు ఉంచి మెక్సికోలోని పేదలకు పంచి పెట్టింది అలెజాండ్రినా ఎల్ చాపో. బాక్సుల దగ్గర నుంచి ధరిస్తున్న మాస్కుల వరకు ఎల్‌చాపో ఫోటోలు ముద్రించి ఉన్నాయి. ఇక గుజ్‌మ్యాన్‌ కంపెనీ ఫేస్‌బుక్ పేజ్‌పై ఎప్పటికప్పుడు వారు చేస్తున్న సేవాకార్యక్రమాలను సంస్థ పోస్టు చేస్తోంది. తమ ఇళ్లను సందర్శించి తమకు తోచినంత సహాయం చేయడం చాలా తృప్తిని ఆనందాన్ని కలిగిస్తోందని అలెజాండ్రినా చెప్పినట్లు ఫేస్‌బుక్‌పేజ్‌పై ఉంది.

ఎవరీ జాక్విన్ ఎల్ చాపో గుజ్‌మ్యాన్?

ఎవరీ జాక్విన్ ఎల్ చాపో గుజ్‌మ్యాన్?

ఇంతకీ ఎల్‌చాపో గుజ్‌మ్యాన్ ఎవరో తెలుసా.. 2009 ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ కుబేరుల్లో ఈయన కూడా ఒకరు. డ్రగ్స్‌పైనే తన సామ్రాజ్యాన్ని నిర్మించాడు గుజ్‌మ్యాన్ అయితే అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో ఆయనపై మెక్సికన్ పోలీసులు ఎప్పటి నుంచో నిఘా ఉంచారు. 1993లో గ్వాటెమాలలో చాపోను పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో ఆయనకు 20 ఏళ్లు కారాగారశిక్ష విధించింది కోర్టు. ఆయనపై హత్య మరియు అక్రమ డ్రగ్స్ వ్యాపారం కేసులు నమోదయ్యాయి. అయితే జైలులో ఉండగా 2001లో పోలీసులకు లంచం ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆసమయంలో మెక్సికో అమెరికా దేశాలు కలిపి ఎల్‌చాపోను పట్టుకుని అప్పగించిన వారికి 8.8 మిలియన్ డాలర్లు బహుమతిని ప్రకటించాయి. 2014లో మెక్సికో పోలీసులు అరెస్టు చేయగా..2015లో జైలు సెల్‌లో టన్నెల్ ద్వారా మళ్లీ తప్పించుకున్నాడు. అయితే 2016లో జరిగిన షూట్‌అవుట్‌లో ఎల్‌చాపోను పట్టుకున్న పోలీసులు అతన్ని అమెరికాకు తరలించారు. 2019లో ఆయనకు జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ అమెరికా కోర్టు తీర్పు చెప్పింది.

Recommended Video

RBI Governor Press Meet Highlights, RBI Cuts Reverse Repo Rate By 25 Bps to 3.75%

English summary
A daughter of the notorious drug kingpin Joaquin “El Chapo” Guzman and Mexican cartels are distributing coronavirus aid packages as the number of confirmed COVID-19 cases begin to soar in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X