• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనసు కదిలించే ఘటన: చనిపోతూ ఈ తాత రెండేళ్ల చిన్నారికి ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?

|

యూకే: క్రిస్మస్ అనేది ఒక ప్రత్యేకమైన పండగ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకునే వేడుక. ఈ పండగ రోజు చిన్నపిల్లలకు శాంటాక్లాస్ ఇచ్చే బహుమతులు ఎంతో అమూల్యమైనవిగా భావిస్తారు. కానీ ఓ పెద్దాయన మాత్రం తన పొరిగింటిలో ఉండే ఓ రెండేళ్ల చిన్నారి కోసం 14 ఏళ్లకు సరిపడ బహుమతులు కొన్ని ఇచ్చాడు. అయితే ఆయన మరణించబోతున్నాడని తెలిసి ఒక్కో క్రిస్మస్‌ వేడుకకు ఒక్కో గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు. అలా ఆ చిన్నారి 16 ఏళ్లు వచ్చేసరికి అన్ని గిఫ్ట్‌లు పాపకు అందాలని రాశాడు.

 రెండేళ్ల చిన్నారికి క్రిస్మస్ కానుకలు ఇచ్చిన కెన్

రెండేళ్ల చిన్నారికి క్రిస్మస్ కానుకలు ఇచ్చిన కెన్

యూకేలోని గ్లామర్గాన్‌లో నివాసం ఉండే కెన్ వాట్సన్ ఈ ఏడాది అక్టోబర్‌లో మృతి చెందాడు. ఆ సమయానికి ఆయన వయస్సు 87 ఏళ్లు. అయితే తను బతికున్న చివరి రోజు వరకు తనకు ఎంతో ఇష్టమైన పొరిగింటిలో ఉంటున్న రెండేళ్ల క్యాడి అనే పాపతోనే సమయం గడిపాడు. తను త్వరలో మృతి చెందబోతున్నానని తెలిసి పాపతో తన జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని భావించి ఆమెకు 14 ఏళ్లపాటు వచ్చే క్రిస్మస్ కానుకలు ముందే కొని తన దగ్గర ఉంచుకున్నాడు. తను మృతి చెందిన తర్వాత ఒకరోజు ఆయన గదికి తన కూతురు వెళ్లి చూడగా క్రిస్మస్ కానుకలు కనిపించాయి. అవన్నీ చిన్నారి క్యాడి కోసం అని మరో లేఖ రాసి ఉండటంతో కెన్ వాట్సన్ కూతురు జెన్నీ అవి ఇచ్చేందుకు ఒక బస్తాలో ప్యాక్ చేసుకుని క్యాడీ ఇంటికి వెళ్లి ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 14 ఏళ్ల పాటు పెద్దాయన గిఫ్ట్స్ పంపడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

చిన్నారి క్యాడీ అంటే తాత కెన్‌కు సెంటిమెంటు

చిన్నారి క్యాడీ అంటే తాత కెన్‌కు సెంటిమెంటు

ముందుగా ఆ బస్తాను చూడగానే ఏదో చెత్త ఉంటుంది... అది పడేసేయాలని జెన్నీ చెబుతుందేమో అని తను భావించినట్లు క్యాడీ తండ్రి ఓవెన్ విలియమ్స్ చెప్పారు. కానీ అవి క్రిస్మస్ గిఫ్ట్స్ అని చెప్పడంతో షాక్‌కు గురైనట్లు వెల్లడించాడు. తన బిడ్డపై కెన్ వాట్సన్ ఎంత మమకారం పెంచుకున్నారో తలుచుకుని ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగినట్లు వెల్లడించాడు. క్యాడీ అంటే తనకు సెంటిమెంటు అని చెప్పేవాడని విలయమ్స్ గుర్తు చేసుకున్నాడు. క్యాడీ పుట్టిన మొదటి సంవత్సరం నుంచే కెన్ క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చేవాడట. క్యాడీ మొదటి క్రిస్మస్ బహుమతిగా ఒక సుతిమెత్తని బొమ్మను ఇచ్చినట్లు విలయమ్స్ గుర్తుచేసుకున్నారు. క్యాడీకి ఎలాంటి బొమ్మలు ఇష్టమో ముందే గ్రహించి అవి కొనిపెట్టుకున్నట్లు ఉందని బహుమతులను చూశాక చెప్పారు ఓవెన్ విలియమ్స్.

 క్యాడీకి 16 ఏళ్లు వచ్చేవరకు గిఫ్ట్స్

క్యాడీకి 16 ఏళ్లు వచ్చేవరకు గిఫ్ట్స్

జరిగిన విషయాన్ని ఒవెన్ విలయమ్స్ తన ట్విటర్‌‌లో రాసుకున్నారు. అది మరుపురాని విషయంగా పేర్కొన్నారు. క్యాడీ 16 ఏళ్లు వచ్చేవరకు ఆమెకు ప్రతి క్రిస్మస్‌కు ఒక కానుకు ఉంటుందని చెబుతూ గిఫ్ట్స్ ఇచ్చిన కెన్ వాట్సన్‌కు ధన్యవాదాలు అని తెలిపారు. ఆ తర్వాత చక్కగా గిఫ్ట్ కవర్లతో ప్యాక్ చేయబడ్డ కానుకలను ఫోటోలు తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు విలయమ్స్. ప్రస్తుతం ఈ క్రిస్మస్‌కు సంబంధించి ఒక గిఫ్ట్ మాత్రమే ఓపెన్ చేసినట్లు చెప్పిన విలయమ్స్ అందులో క్యాడికి ఒక పుస్తకాన్ని బహుమతిగా కెన్ ఇచ్చారని వెల్లడించాడు. ఇక మిగతా గిఫ్ట్‌లను తెరవాలని ఉన్నప్పటికీ... కెన్ మాట ప్రకారంగా ప్రతీ క్రిస్మస్‌కు ఒక బహుమానం తెరిచి చూస్తామని చెప్పాడు. ఈ విషయం అంతా ఓవెన్ విలయమ్స్ ట్విటర్‌పై పోస్టు చేయడంతో పోస్టు వైరల్‌గా మారింది. పెద్దాయన చూపిన ప్రేమ పట్ట నెటిజెన్లు ఫిదా అయ్యారు. తమదైన శైలిలో కామెంట్స్ రాశారు.

English summary
Christmas is a time to spread cheer and joy. And Whales' Ken Watson continues to do so even in death. The octogenarian recently passed away in October but not before ensuring he bought fourteen presents for his neighbour's young daughter Cardi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X