జకీర్ నాయక్‌పై చార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ
న్యూఢిల్లీ : శ్రీలంకలో ఉగ్ర దాడుల తర్వాత జకీర్ నాయక్ కు చెందిన పీస్ టీవీ ప్రసారాలను నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈస్టర్ సండే రోజున ఉగ్రవాదులు చేసిన దాడితో 250 మంది చనిపోవడతో ఈ మేరకు శ్రీలంకకు చెందిన కేబుల్ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ పీస్ టీవీ ప్రసారాలను ఇప్పటికే భారత్ తోపాటు బంగ్లాదేశ్ నిషేధం విధించాయి.

శ్రీలంకలో బ్యాన్
పీస్ టీవీ ప్రసారాలతో యువత ఐఎస్ ఉగ్రవాద కార్యకలపాల్లో చేరుతున్నారని శ్రీలంకకు చెందిన డైలాగ్, ఎస్ ఎల్ టీ కేబుల్ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నాయి. కానీ దీనిని శ్రీలంక ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది.

2006లో ప్రారంభం ..
ముంబైకి చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పీస్ టీవీని 2006లో ప్రారంభించింది. ఉర్దూ ప్రసారాలను 2009 నుంచి టెలికాస్ట్ చేస్తున్నారు. 2011లో బంగ్లా వెర్షన్ ను ప్రసారం చేశాయి. ఈ మూడు భాషలకు సంబంధించిన ప్రసారాలను దుబాయి నుంచి టెలికాస్ట్ చేస్తున్నారు.

జకీర్ ఆస్తుల అటాచ్
రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని జకీర్ నాయక్ చేస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2016లో కేసు నమోదు చేసింది. దీంతో జకీర్ 2016లో భారత దేశం వదిలిపోయారు. మలేషియా పౌరసత్వం తీసుకొని అక్కడే నివసిస్తున్నాడు. శ్రీలంక దాడుల తర్వాత జకీర్ పై ఈడీ కూడా చార్జీషీట్ దాఖలు చేసింది. జకీర్ కు సంబంధించి 50.46 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జకీర్, అతని సంస్థలకు సంబంధించి మొత్తం 193.06 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications