క్రైస్తవులు వెళుతున్న బస్సుపై ఉగ్ర కాల్పులు: ఏడుగురు మృతి, 16మందికి గాయాలు
కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ క్రైస్తువల బృందం వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 16మందికి గాయాలయ్యాయి.
మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే ఆరుగురున్నారు. చర్చి నుంచి వీరంతా తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కైరోలోని మినిమియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.












Click it and Unblock the Notifications