• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈజిప్ట్‌ గోల్డెన్ సిటీ: పురావస్తు తవ్వకాల్లో బయటపడిన 3000 ఏళ్ల నాటి ‘బంగారు నగరం’

By BBC News తెలుగు
|

ఈజిఫ్ట్‌లో బయటపడిన గోల్డెన్ సిటీ

ఈజిఫ్ట్‌లో పురాతన నగరం ఒకటి బయటపడింది.

ఇసుకలో సమాధి అయిన 3000 సంవత్సరాల కిందటి బంగారు నగరం ఇన్నాళ్లకు బయటపడింది.

దీనిని టుటన్‌ఖమున్ సమాధి తర్వాత అత్యంత ముఖ్యమైన పురావస్తు అన్వేషణల్లో ఒకటిగా చెబుతున్నారు.

లక్సర్ దగ్గర గుర్తించిన ఈ అద్భుతమైన, అరుదైన కట్టడాలను చూసి ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోతున్నారు.

'గోల్డెన్ సిటీ'గా పిలిచే ఈ నగరం పేరు ఏథెన్ అని చెబుతున్నారు.

ఏథెన్ అతిపెద్ద పురాతన నగరం అని, ఇంత పెద్ద నగరాన్ని ఈజిఫ్టులో ఇప్పటివరకు కనుగొనలేదు" అని ప్రముఖ ఈజిఫ్టాలజిస్ట్ జహీ హవాస్ చెప్పారు.

వాలీ ఆఫ్ కింగ్స్ దగ్గర జరిగిన తవ్వకాల్లో విలువైన కళాకృతులు కనుగొన్నారు

2020 సెప్టెంబర్‌లో తవ్వకాలు ప్రారంభించిన తర్వాత దీనిని కొన్ని వారాల్లోనే పూర్తిగా వెలుగులోకి తీసుకురాగలిగారు.

ఈ నగరం ఈజిఫ్టులో అత్యంత శక్తిమంతులైన ఫారోల్లో ఒకరైన మూడో అమెన్‌హొటెప్ కాలం నాటిది. ఆయన క్రీ.పూ 1391 నుంచి 1353 వరకు పాలించారు.

ఈ నగరాన్ని ఆయన తర్వాత ఆయ్, టుటన్‌ఖమున్ ఫారోలు కూడా పాలించారు.

దాదాపు చెక్కుచెదరని వారి సమాధులను బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ 1922లో వాలీ ఆఫ్ కింగ్స్‌లో కనుగొన్నారు.

"టుటన్‌ఖమున్ సమాధి తర్వాత ఇప్పుడు గుర్తించిన ఈ పురాతన నగరం, రెండో అతి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణగా నిలిచింది" అని బాల్టిమోర్‌లోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ ఈజిఫ్టాలజీ ప్రొఫెసర్ బెస్టీ బ్రియాన్ చెప్పారు.

తవ్వకాలు జరిగిన ప్రాంతం

"పురాతన ఈజిఫ్ట్ ప్రజల జీవితం గురించి తెలుసుకోడానికి ఇది మనకు ఒక అరుదైన దృశ్యాన్ని అందించింది" అని ఆమె చెప్పారు. ఫారోల సామ్రాజ్యంలో ఇది అత్యంత సంపన్న నగరం.

భారీ సంఖ్యలో ఆభరణాలు, రంగుల మట్టిపాత్రలు, పేడ పురుగుల ఆకారంలో ఉన్న తాయెత్తులు, మూడో ఆమెన్‌హొటెప్ ముద్ర ఉన్న ఇటుకలు, ఇంకా ఎన్నో వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డాయి.

టుటన్‌ఖమున్ శవపేటికను పరిశీలిస్తున్న డాక్టర హవాస్

రాజధాని కైరోకు దక్షిణంగా దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో 'వాలీ ఆఫ్ కింగ్స్‌'కు దగ్గరగా లక్సర్ పశ్చిమ తీరంలో ఈ తవ్వకాలు జరిపారు.

"అన్ని వైపులా పేర్చిన ఇటుకల వరుసలు కనిపిస్తూ ఉండడంతో ఆ బృందాలు ఆశ్చర్యపోయాయి. దాదాపు పూర్తిగా ఉన్న గోడలు, రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువులు ఆ గదుల్లో ఉన్నాయి. ఆ నగరం మంచి స్థితిలో ఉంది" అని డాక్టర్ హవాస్ చెప్పారు.

తవ్వకాలు ప్రారంభించిన ఏడు నెలలకు దానికి చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలను కూడా ఈ బృందాలు వెలుగులోకి తెచ్చాయి. వాటిలో ఒక బేకరీ, ఒక పరిపాలనా కేంద్రం, నివాస ప్రాంతం లాంటివి ఉన్నాయి.

"ఇన్నాళ్లూ కనిపించని ఈ గోల్డెన్ సిటి కోసం ఎందరో విదేశీయులు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎవరూ దానిని గుర్తించలేకపోయారు" అని డాక్టర్ హవాస్ చెప్పారు. ఆయన గతంలో పురావస్తుశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయని, నిధి నిక్షేపాలతో నిండిన సమాధులు బయటపడతాయని తాము ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

రాజకీయ అస్థిరత, కరోనా మహమ్మారి కారణంగా ఈజిఫ్ట్ పర్యటక రంగం కుదేలైంది. టూరిజాన్ని ప్రోత్సహించి దానికి కొత్త ఊపిరులూదాలని ప్రయత్నిస్తోంది అక్కడి ప్రభుత్వం.

తవ్వకాల్లో దొరికిన మట్టిపాత్ర

ఈజిఫ్ట్ ఇటీవలే తమ దేశ ప్రాచీన పాలకుల అవశేషాలను కైరో వీధులగుండా ఊరేగింపుగా తీసుకెళ్లింది.

కనులవిందుగా జరిగిన ఆ కార్యక్రమంలో మొత్తం 22 మమ్మీలను పరేడ్‌గా తీసుకెళ్లారు.

వాటిని నియో క్లాసికల్ ఈజిఫ్టియన్ మ్యూజియం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని న్యూ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిఫ్టియన్ సివిలైజేషన్‌కు తరలించారు.

కొత్త మ్యూజియానికి తరలించిన మమ్మీల్లో అమెన్‌హొటెప్ త్రీ, ఆయన భార్య క్వీన్ టియేవి కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Egypt Golden City: Archaeological excavations uncover 3000 year old 'Golden City'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X