విమానం నుంచి జారిపడిన బాంబు: 8మంది మృతి
బాగ్దాద్: ఇరాక్‌కి చెందిన ఓ మిలిటరీ విమానం ప్రయాణిస్తుండగా సాంకేతిక కారణాల వల్ల ప్రమాదవశాత్తు ఆ విమానం నుంచి బాంబు జారి బాగ్దాద్ ప్రాంతంలో పడింది. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి.
అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇరాక్, సిరియాలలోని ఐఎస్‌ఐఎస్ స్థావరాలపై బాంబు దాడులు జరిపి తిరిగి వస్తుండగా అనుకోకుండా విమానంలో సాంకేతిక లోపం ఎదురైంది.
దీంతో విమానంలోని బాంబు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ బాంబు పేలుడులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

వైమానిక దాడుల్లో వందమంది మృతి
యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో వందమంది ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారు.
హౌతి తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఉత్తర, దక్షిణ యెమెన్ ప్రాంతాలపై సౌదీ అరేబియాకు చెందిన యుద్ధ విమానాలు ఈ దాడులు నిర్వహించాయి. ఈ దాడులు అమ్రాన్ ప్రావిన్స్‌లోని మార్కెట్‌పై పడటంతో షాపింగ్‌కు వచ్చిన పలువురు ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications