వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాతోని ప్రాబ్లమ్ ఐతే నేనెళ్లిపోతా రా భయ్- ఎలాన్ మస్క్ నిర్వేదం..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌‌లో తీవ్ర అలజడి చెలరేగింది. అల్లకల్లోలానికి గురైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడిందనే సంకేతాలను కూడా పంపించింది. కొన్ని సంవత్సరాల పాటు సజావుగా సాగుతూ వచ్చిన ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో సంక్షోభ పరిస్థితులకు కారణమైంది.

ఫోర్త్ వేవ్- దేశంలో కరోనా ఉధృతి: కేంద్రం హైఅలర్ట్: కఠిన నిర్ణయాల వైపు ..!!ఫోర్త్ వేవ్- దేశంలో కరోనా ఉధృతి: కేంద్రం హైఅలర్ట్: కఠిన నిర్ణయాల వైపు ..!!

ఉద్యోగాల కోత..

ఉద్యోగాల కోత..

ట్విట్టర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు ఎలాన్ మస్క్. ఆయన చేపట్టిన చర్యలపై తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగాల్లో కోత పెట్టారు. కొత్త ఉద్యోగాల నియామకాలను నిలిపివేశారు. టెక్నికల్, సేల్స్, ప్రొడక్ట్స్, అడ్వర్టయిజ్‌మెంట్, లీగల్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కుదించారు. దీని తరువాత ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించే చర్యలను చేపట్టాయి.

యాడ్స్ కూడా బంద్..

యాడ్స్ కూడా బంద్..

ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ కూడా దీనికి మినహాయింపు కాదు. లీగల్, పాలసీ చీఫ్ విజయ గద్దె కూడా తప్పుకోనున్నారు. ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్గెట్ సైతం కంపెనీని వీడనున్నారు. 2012 నుంచీ సీన్ ఎడ్గెట్.. ట్విట్టర్‌లో కొనసాగారు. ఎలాన్ మస్క్ వ్యవహార శైలి నచ్చకపోవడం పలువురు సెలెబ్రిటీస్ కూడా తమ ట్విట్టర్ అకౌంట్స్‌ను డిలెట్ చేసుకున్నారు. అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ జనరల్ మోటార్స్..ట్విట్టర్‌కు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను నిలిపివేసింది.

 ఉద్యోగులు సామూహికంగా..

ఉద్యోగులు సామూహికంగా..

ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ట్విట్టర్ ఉద్యోగులందరూ మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. సామూహికంగా రాజీనామాలు చేశారు. ఈ పరిణామంతో పలు దేశాల్లో ట్విట్టర్ కార్యాలాయాలు మూత పడ్డాయి. ఈ పరిణామాలన్నింటికీ మూల కారకుడు ఎలాన్ మస్క్ వైఖరేనంటూ ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయనను దోషిగా చిత్రీకరించారు నెటిజన్లు.

 రాజీనామాకు అంగీకారం..

రాజీనామాకు అంగీకారం..

ఈ పరిణామాల మధ్య ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన కొనసాగింపుపై ట్విట్టర్‌లో ఇటీవలే ఓ పోల్‌ను నిర్వహించారాయన. మెజారిటీ యూజర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అర్జెంట్‌గా తప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనికి మస్క్ సానుకూలంగా స్పందించారు. తాను రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. తన స్థానంలో ఓ మూర్ఖుడిని వెదుక్కున్న వెంటనే రాజీనామా చేస్తాననీ చెప్పారు.

English summary
Elon Musk agrees for step down as chief executive of Twitter, once he finds a replacement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X