• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుతిన్‌కు ఫోన్ కాల్‌పై ఎలాన్ మస్క్: యుద్ధాన్ని నివారించడానికి - 18 నెలల కిందట

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా నెలల తరబడి తన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. తాజాగా రాజధాని కీవ్‌ను చుట్టుముట్టాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ నగరంపై రష్యా సైనిక బలగాలు దాడులు చేస్తోన్నాయి. రాజధానిని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ తీర్చిదిద్దుకున్న రక్షణ వ్యవస్థను రష్యా సైన్యం ఛేదించింది. రాకెట్లతో విరుచుకుపడుతోంది.

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్, ఖార్కీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డొనెట్స్క్, లుహాన్స్క్ ఝపరొజ్ఝియా, ఖేర్సన్ రీజియన్లను రష్యా విలీనం చేసుకోవడానికి రెఫరెండం సైతం నిర్వహించింది. క్రిమియా రీజియన్ నుంచి రష్యాను కనెక్ట్ చేసే 19 కిలోమీటర్ల వంతెనను అతి పొడవైన వంతెనను ఉక్రెయిన్ పేల్చేసిన తరువాత రష్యా ఈ దాడులను తీవ్రతరం చేసింది.

Elon Musk has dismissed the reports of speaking to Russian President Vladimir Putin

ఈ పరిణామాల మధ్య అపర కుబేరుడు ఎలాన్ మస్క్ పేరు తాజాగా తెర మీదికి వచ్చింది. యుద్ధాన్ని నివారించడానికి ఆయన ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు వార్తలొచ్చాయి. రెండు దేశాల మధ్య సంధి కుదర్చడానికి ఇప్పటికే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి చర్చల ప్రతిపాదనలు పంపించినప్పటికీ- దాన్ని ఆయన తిరస్కరించారు. ఉక్రెయిన్ రక్షణ, విదేశాంగ మంత్రులు ఈ ప్రతిపాదనలను కొట్టిపారేశారు.

ఇప్పుడు మళ్లీ మస్క్ వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో చర్చించినట్లు వార్తలు రాగా దాన్ని ఆయన తోసిపుచ్చారు. తాను పుతిన్‌తో మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. ఈ మేరకు నార్త్‌మన్ ట్రేడర్ వ్యవస్థాపకుడు స్వెన్ హెన్రిక్ పోస్ట్ చేసిన ట్వీట్‌కు బదులిచ్చారు. 18 నెలల కిందట తాను పుతిన్‌తో ఫోన్‌లో ఒకే ఒక్కసారి మాట్లాడానని, మళ్లీ ఆ అవకాశం రాలేదని స్పష్టం చేేశారు. ఉక్రెయిన్‌తో రష్యా ప్రభుత్వం శాంతిచర్చలను నిర్వహించడానికి ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్లు చెప్పారు.

తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఉక్రెయిన్‌లో రష్యన్ చర్యలను ముగించడానికి పోల్‌ను చేపట్టారు. యుద్ధాన్ని నివారించడానికి కొన్ని పరిష్కార మార్గాలను అందులో పొందుపరిచారు. అక్టోబర్ 3వ తేదీన నిర్వహించిన ఈ ఓటింగ్‌లో 27,48,378 మంది పాల్గొన్నారు. ఈ శాంతి చర్చల ప్రతిపాదనలను మెజారిటీ ఓటర్లు నిరాకరించారు. 59.1 శాతం మంది నో అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

English summary
Tesla CEO Elon Musk has dismissed the reports of speaking to Russian President Vladimir Putin before doling out a peace proposal on Twitter to end the ongoing war in Ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X