వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్క్ మాములుగా లేడుగా.. పరాగ్ అగర్వాల్, విజయ గద్దె ఔట్..? ఆందోళనలో ఎంప్లాయీస్

|
Google Oneindia TeluguNews

ఎలాన్ మాస్క్ ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది చివర వరకు పూర్తవనుంది. అయితే ఇప్పుడు ఉన్న సీఈవో పరాగ్ అగర్వాల్‌పై ఆయన కన్నుపడింది. ఆయన పోస్ట్ బూస్టింగ్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకాదు కొత్త సీఈవోను కూడా వెతికారు. మాస్క్ ట్విట్టర్ కొనుగోలుతో ఉద్యోగుల్లో కూడా కొంత భయం ఉంది. తమ జాబ్స్ ఎక్కడ పోతాయోనని ఆందోలన చెందారు.

అంతేకాదు సీఈవో పరాగ్ అగర్వాల్ కూడా ఉద్యోగాల తొలగింపు అంశంపై స్పందించారు. పలు ప్రశ్నలను సంధించారు. భవిష్యత్‌లో ట్విట్టర్ ఎలా ఉండబోతుందనే అంశంపై కూడా ఆందోళన చెందారు. ఉద్యోగుల తొలగింపు అంశం అగ్గిరాజేసింది. అయితే ఇప్పటికైతే జాబ్స్ తీయడం ఉండదని.. భయపడొద్దని పరాగ్ ధైర్యం చెప్పారు. అయితే రాయిటర్ వార్తా సంస్థ మాత్రం సంచలన విషయం రిపోర్ట్ చేసింది.

Elon Musk plans to replace Twitter CEO Parag Agrawal and fire Vijaya Gadde

ఈ ఏడాది చివరి నాటికి 44 బిలియన్ డాలర్లతో మాస్క్ ట్విట్టర్ కొనుగోలు చేస్తే.. పరిస్థితులు మరోలా ఉండనున్నాయి. ఇప్పుడు ఉన్న చైర్మన్ బ్రెట్ టేలర్‌కు సరయిన మేనెజ్ మెంట్ లేదని.. మార్చాల్సిన అవసరం ఉందని హింట్ ఇచ్చారు. గత నవంబర్‌లో జాక్ డార్సీ నుంచి అగర్వాల్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. మాస్క్ చేతికి పగ్గాలు వచ్చేవరకు అగర్వాల్ పదవీ బాధ్యతలను చేపడుతారు. తాను ట్విట్టర్ కొనుగోలు చేస్తే.. అగర్వాల్‌ను తీసివేస్తానని ఇదివరకే మాస్క్ ప్రకటించారు.

కంపెనీలో ఎక్కువ జీతాలు ఉన్నవారిని కూడా తొలగించాలని మాస్క్ అనుకుంటున్నారు. లీగల్ హెడ్ విజయ గద్దెన కూడా తప్పించాలని భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు న్యూ యార్క్ పోస్ట్ తెలిపింది. గద్దెకు 12.5 మిలియన్ డాలర్ల ప్యాకేజీ.. ట్వీట్టర్ షేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు 17 మిలియన్ డాలర్లు ఏడాదికి సంపాదిస్తోంది. కంపెనీలో హైయస్ట్ పెయిడ్ ఉద్యోగి కావడంతో.. ఆమెకు మంగళం పాడాలని అనుకుంటున్నారు.

గద్దె కూడా బాధపడ్డారు. ట్విట్టర్ భవిష్యత్ ఏంటీ అని ఉద్యోగుల వద్ద కన్నీటి పర్యంతం అయ్యారు. ఉద్యోగులు కూడా భయపడుతున్నారు. తమ జాబ్స్ సెక్యూరిటీ ఏదీ అని అడుగుతున్నారు. సీఈవో, లీగల్ హెడ్ పోస్టులు పోయాక.. తమలాంటి వారివి ఏంటీ అని అడుగుతున్నారు

English summary
elon Musk has already lined up a new Chief Executive for Twitter who will replace Agrawal once the $44 billion sale deal is completed later this year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X